ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకనము

xi



1. ‘అమ్మా యేమని చెప్పుదు’ - పారిజాత॥ 1-75
   ‘తెఱవా యేమని చెప్పుదు’ - రా॥ సా॥ 26
2. ‘ఏమేమి కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా’ - పారి॥ 1-82
   ‘ఏమేమీ వెఱపింత లేకనె భళా హేమాంగి యిట్లాడెనా’ - రాధి॥ 33
3. 'మాసిన చీరఁ గట్టుకొని ....’ పారి॥ 1-99
   ‘జడ వేఁగ వదలించి...’ రాధి॥ 77
4. ‘వెడ వెడఁ గన్నుమూయుఁ గనువిచ్చు...’ పారి॥ 1-101
   ‘ఉలుకును వెచ్చనూర్చుఁ గడు నుస్సురనున్...’ రాధి॥ 78

ఇక ‘బికస్వరంబు’తో నేడ్చుట, “రాయను వింతపుట్టి నదిరాయను” నిట్టివి సర్వప్రబంధసామాన్యములైనవే యిందునుగలవు. రాధయుఁ “జిలువకోమలి" యైనది. సవతి “నరకాలఁ బెట్టి నేలరాయకున్నను నా పేరు రాధగాదు” అని ప్రతినఁ బట్టినది. అయినను ముక్కుతిమ్మన, ముద్దుపళనుల నాయికలవలె నాయకునిపై నెడమకాలి నెత్తలేదు. మఱియు గతానుగతిక మగు ప్రబంధధోరణికి నీకావ్యమునకు నొక యంతరము గలదు. ఆవర్లనల యూర్ణనాభస్వభావముగాని, యనుప్రాసల యట్టహాసములుగాని యిందు లేవు. పురవర్ణనాదులు లేవు సరి గదా విరహవర్ణనల సందర్భమునను జంద్రోపాలంభాదులు పరిహరింపఁబడినవి. కాని, చేసినతప్పు చెప్పకతప్పదు, చేయరాని వర్ణనయొకటి చేసినాఁడు కవి, అదియు సుదీర్ఘముగా—