ఈ పుట ఆమోదించబడ్డది

(చూ.ము. ప. రా. సా. 2-116 కూడ-తిమ్మన కృత్యనుకృతులును గలవు. అవి స్థలాంతరమునఁ జూపఁబడినవి.)

అన్నట్లు తాళ్ళపాక తిమ్మక్క వొకమూఁడుముక్కలు వాఁడుకొన్నాఁడని యామధ్య నొక యమ్మక్కగారు చేమకూరనెత్తిపై నొకయభాండ మెత్తినారు; అది యొక మిషగాఁ బురుషకవులనెల్లఁ దూర్పారఁబట్టినారు. మఱి దీనికేమందురో? దానిమాట కేమి గాని, సముఖము వాని కృతి నెంత యనుకరించినను ముద్దుపళని కృతికి దానిప్రత్యేకత దానికున్నది. ఆమె తక్కువ తిన్నదా మఱి? ప్రతాపసింహున ప్రాపకమున శృంగారరసపు సరిహద్దులు చూచినది, కవితా భరత గంధర్వాది కళల కిటుకులు కనుఁగొన్నది. శతపద్యపరిమితమైన సముఖము కృతిని గ్రహించి, కించిదూనముగా నాఱువందల గ్రంథమును దయారుచేసినది. తప్పక తదుపజ్ఞమైన గ్రంథమును రసికప్రశంసనీయమే. సముఖము గ్రంథములో నప్పుడే ‘యిళ’ సుద్ది కొద్దిగాఁ బుట్టియున్నను నా ప్రతినాయిక పాత్రీకరణమునఁ జిత్రలేఖనపుఁ జమకుల నతిమాత్రమనోజ్ఞముగాఁ బ్రదర్శించినది పళని. సముఖముకంటె నెక్కువగా శృంగారరసరహస్యముల సూదంటుపనితనమునఁ దిమ్మనగారి యొరవడిని, పలుకుఁబళ్ళ మెఁలకువలలోఁ జేమకూరపాకమును సమర్థించినది. నాఁటికవుల కది యొక పరిపాటి.

సముఖము కృతి యేకాశ్వాసప్రబంధము. కవి దీనినిఁ జాటుప్రబంధమని పేర్కొనినాఁడు. గ్రంథాంతగద్యలో పూర్వలాక్షణికు లుదాహరణ ముక్తకాది కావ్యభేదములనే కాని యిట్టినిబద్ధకావ్యములను జాటుప్రబంధములుగాఁ బేర్కొన