ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టించి ఆ బురదలోనుండి వెలుపలకు లాగుతుంది. వాళ్లకు మంచి మరణం అనుగ్రహిస్తుంది. ఈ సత్యం మనకెంతైనా సంతోషాన్నీ ఉత్సాహాన్నీ కలిగించాలి. తల్లిలేని పిల్లలు దిక్కూ మక్కూ లేక బావురు మంటూంటారు. తల్లిగల పిల్లలకు అన్ని హంగులూ అమరుతాయి. మరియమాతను తల్లిగా అంగీకరించి ఆమె పట్ల భక్తిభావం చూపించే వాళ్ల భాగ్యం అంతింతగాదు. ఆమెను తల్లిగా అంగీకరించనివాళ్ల దౌర్భాగ్యమూ అంతింతగాదు.

ఇక, మరియమాతపట్ల చూపే భక్తి క్రియలన్నిటిలోను హృదయం ప్రధానం. అనగా నిండు హృదయంతో ఆ తల్లిని పూజించాలి. ఈలా పూజించాలంటే మనరక్షణ చరిత్రలో ఆమె నిర్వహించిన పాత్రను చక్కగా అర్ధం చేసికొనివుండాలి. ఆమె దేవమాత, సహరక్షకి. ఈ రెండు బిరుదాలను అర్థంచేసికున్నవాళ్లు ఆమె స్థానమేంటో వెంటనే గ్రహిస్తారు. హృదయంలో భక్తి లేకుండా బయటకు మాత్రమే భక్తి క్రియలు చూపెడుతుంటే అవి కేవలం మూఢాచారాలే ఔతాయి. ఈ సందర్భంలో "భక్తి గలుగు కూడు పట్టెడైన చాలు" అనే వేమనవాక్యం స్మరింపదగ్గది.


ఇంకొ విషయం గూడ. మనం దేవుణ్ణి పూజిస్తాం, ఆరాధిస్తాం.సృష్టి ప్రాణులైన పునీతులు దేవదూతలు మొదలైన వాళ్లను ఆరాధించం, పూజిస్తాం. ఇక మరియమాతను పనీతుల కంటె అధికంగా పూజిస్తాం. కాని ఓ దేవుణ్ణి ఆరాధించినట్లు ఆరాధించం.

మరియను పూజించడంలో ప్రధానోద్దేశం, దేవుడు ఆమెకు అనుగ్రహించిన భాగ్యాలను కొనియాడ్డమే. ఆమె అంది "ఇకమీదట సకల తరాలవాళ్లు నన్ను ధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటే దేవుడు