ఈ పుట ఆమోదించబడ్డది

రచయితలు ఆమె శిశువును కన్నాక గూడ కన్యత్వాన్ని కోల్పోలేదని వ్రాశారు. వారికి ఆమె కన్యత్వం ముఖ్యం. కాని నేటి రచయితలు ఆమె కటిక పేదల అగచాట్లకు గురైందని చెప్తున్నారు.

4. శిశువును కానుక పెట్టడం :

మరియా యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించారు. ఆ సమయంలోనే వృద్ధుడైన సిమియోను వచ్చి ఈ శిశువు అనేకుల పతనానికీ ఉద్ధరణానికీ కారకుడౌతాడు. ఓ ఖడ్గం నీ హృదయాన్నిగూడ దూసుకొని పోతుందని మరియతో చెప్పాడు. పూర్వ రచయితలు ఇక్కడ మరియ మోషే ధర్మశాస్రానికి విధేయురాలు కావడం గొప్ప అని చెప్పారు. కాని ఆధునికులు ఇక్కడ తల్లిగా మరియు అనుభవించిన బాధలు ముఖ్యమని చెప్తున్నారు. బాధ్యత నెరిగిన వ్యక్తిగా ఆమె కుమారునితో పాటు తానూ భావికాలంలో రాబోయే శ్రమలను అనుభవించడానికి సంసిద్ధమైంది.

5. ఈజిప్టుకు పారిపోవడం :

తిరుకుటుంబం రాజకీయంగా దేశబహిష్కృతమైంది. ఇప్పుడు కూడ పాలస్తీనా నుండి ఈజిప్టుకు మట్టిరోడ్డు వెంటప్రయాణం చేయడం చాలకష్టం. మరియు భద్రంగా గట్టిన కాన్వెంటు గోడల మధ్య వసించలేదు. ఎండ వానలకూ శీతోష్టాలకూ గురైంది. ఆనాటి క్రూరరాజకీయాలకు చిక్కి నలిగిపోయింది. మరియా యోసేఫులు పూర్వపు యిప్రాయేలీయుల్లాగే కాందిశీకులుగా, పేదలుగా ఈజిప్టునకు వెళ్లారు. అక్కడ బానిస బ్రతుకులు ఈడ్చారు. ఇక్కడ బేల్లెహేములో క్రీస్తు శిశువు తప్పించుకొని పోయాడని ఆగ్రహించి హెరోదు