ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె మహిమ నుండి అందరూ పునీతులూ మహిమను పొందుతారు. మోక్షవాసులందరూ మొదట దేవుని యందు సంతోషిస్తారు. ఆ పిమ్మట మరియమాత యందు సంతోషిస్తారు. ఆమె మహిమ వాళ్ల మహిమ. ఆమె వాళ్లందరికీ రాజ్ఞ. ఈలా మోక్షంలో క్రీస్తు సమీపంలో మరియు మాత, మరియమాత సమీపంలో సకల పునీతులూ శాశ్వతంగా వసిస్తుంటారు.

3. భక్తి భావాలు

మరియమాత మహిమకు మనమూ సంతోషించాలి. మన నరజాతికి చెందిన ఓ స్త్రీ దేహాత్మలతో నేడు మోక్షంలో వుందంటే మనకే గౌరవం. మన మానవజాతి కంతటికీ మహాలంకారం ఉత్థాపితమాత.

మరియు దేహంలాగే మన దేహమూ ఉత్థాపనమౌతుంది. క్రీస్తు ఉత్థానంలో మరియు పాలుపొందింది. ఆమెలాగే మనంకూడ పాలు పొందుతాం. ఓ రోజు ఉత్థానమౌతాం. అందుకే "శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను" అంటాం. ప్రభువు మళ్లా విజయం చేసి మనయి. దీన శరీరాన్ని మహిమాన్విత శరీరంగా మార్చాలని కోరుకుంటాం. ఆయన రెండవ రాకడకోసం కనిపెట్టుకొని వుంటాం -ఫిలి 3,21. ఈలా ఉత్థానం కోసం ఎదురుచూచే క్రైస్తవ ప్రజకు ఉత్థాపితమాత ఓ ధ్రువతారలా దారి చూపుతుంది. ఆమె మనలనూ తన చెంతకు పిల్చుకుంటుంది.


మరియమాత దేహంలాగే మన ఈ దేహం కూడ ఉత్థానమై దేవుని యెదుట మహిమను పొందుతుంది అన్నాం. ఈ దేహం ఓనాడు దేవుని యెదుట నిలుస్తుంది. అలాంటి ఈ దేహాన్ని మనం పవిత్ర GD