ఈ పుట ఆమోదించబడ్డది

విశేషంగా మరణ సమయంలో ఆమె మన రక్షణ మాతగా వ్యవహరించాలని మనవి చేసికుందాం. "ఇప్పడూ మా మరణ సమయమందూ ప్రార్థించమని బ్రతిమాలుకుందాం.

5. ఉత్థాపితమాత

స్యూడో అగస్టీన్ అనే ఎన్మిదవ శతాబ్దపు రచయిత మరియను గూర్చి ప్రస్తావిస్తూ "మరియమాత దేహం క్రీస్తుకు మందసంగా వుండి పోయింది. కనుక ఆ కుమారుడు ఉన్నకాడే ఆ తల్లి దేహం కూడ వుండిపోవడం సముచితం. ఏ దేహం నుండి క్రీస్తు తన దేహాన్ని చేకొన్నాడో ఆ పునీత దేహం ప్రాణం విడిచాక క్రుళ్లి మన్నయి పోయిందంటే, పురుగులకు మేతయిపోయిందంటే, నాకు నమ్మబుద్ధి పుట్టడం లేదు. కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధిని చేరి వుండాలి" అని వ్రాశాడు. మరియమాత ఉత్థాపితమాత ప్రస్తుతం ఉత్థాపితమాతను గూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఉత్థానం అంటే యేమిటి?

మనం చనిపోయాక మన యీ దేహాలు ఇక్కడే మన్నై పోతాయి. కాని మరియమాత దేహం అలా మన్నై పోలేదు. ప్రభువు ఆమెను దేహాత్మలతో మోక్షానికి తీసికొని వెళ్లాడు. మరియ ఆత్మతో పాటు దేహం కూడ ప్రభు సన్నిధిలో మహిమను పొందింది. ప్రస్తుతం మానవ మాత్రుల దేహాలేవీ మోక్షంలో లేవు. పునీతుల ఆత్మలు మాత్రమే మోక్షంలో వుంటాయి. పునీతుల దేహాలైనా సరే మన దేహాలైనా సరే లోకాంతంలో గాని ప్రభు సన్నిధిని చేరవు. కనుక ప్రస్తుతం క్రీస్తు మినహా, మోక్షంలో వున్న మానుషదేహం మరియమాత దొక్కటే. క్రీస్తు