ఈ పుట ఆమోదించబడ్డది

తొలగించినా క్రీస్తు రక్షణం తగ్గిపోదు. కాని క్రీస్తు రక్షణంతో పాటు ఆమె రక్షణం కూడ వుంటుంది. క్రీస్తుతో పాటు ఆమెకూ స్థానం వుంది. ఆమెకు అసలు స్థానమేలేదు అనకూడదు.

మరియకూడ మన రక్షణంలో పాల్గొంది అన్నపుడు క్రీస్తుకి అప్రియం గలుగదు. ఆమెను గౌరవించడం ద్వారా క్రీస్తుకి Fరవం తగ్గిపోదు. ఆ తల్లిని గౌరవించినపుడు క్రీస్తునే గౌరవించినట్లు.

మరియు రెండవ యేవ. మన పతనాన్ని తలంచుకొనేపుడెల్లా తొలి యేవను స్మరించక తప్పదు. అలాగే మన ఉద్ధరణాన్ని తలంచు కొనేపుడు ఈ రెండవ యేవను స్మరించక తప్పదు. తొలి యేవ పతనమూ, మలియేవ ఉద్ధరణమూ ఈ రెండూ చారిత్రక ఘట్టాలు. వీటిని మనం కాదనకూడదు, కాదనలేము. ఇక మరియ క్రీస్తు రక్షణంలో సహకరించడం వల్ల క్రీస్తుతోపాటు తనూ సహరక్షకి అనబడుతూంది అన్నాం. కాని మరియ క్రీస్తు రక్షణంతో ఏలా సహకరించింది? ఆమె మనలను ఏలా రక్షించింది?

2. మరియ మూడు దశల్లో సహరక్షకి

మరియు మూడు దశల్లో సహరక్షక్రిగా వ్యవహరించింది. క్రీస్తు జననమందు, కల్వరిమీద, మోక్షంనుండి. ఈ మూడు దశలను క్రమంగా విచారించి చూద్దాం.

మొదట, క్రీస్తు జననమందు మరియ సహరక్షకి. దేవదూత తన సందేహం తీర్చగానే మరియు "నీ మాటచొప్పున నా కగునుగాక” అంటుంది. ఆ వాక్యం ఈ నేలమీది నరులు పల్కిన వాక్యాలన్నిటిలోను గొప్పవాక్యం. ఈ వాక్యం ద్వారా పితతో పాటు సుతునితోపాటు