ఈ పుట ఆమోదించబడ్డది

పోయివుండం. ఎందుకంటే ఆమె మనకు తలగాదు. కాని ఆదాము పాపముతో గూడి ఆమె పాపంకూడ మనకు నాశం తెచ్చి పెట్టింది.

తొలి ఆదాము మనలను నాశం జేసినట్లే మలి ఆదాము క్రీస్తు మనలను ఉద్ధరించాడు. అతనిలాగే ఇతడూ నరజాతికి శిరస్సు కనుకనే క్రీస్తు రక్షణం మనకూ సంక్రమించింది. ఈ రెండవ ఆదాము ఉద్ధరణంలో ఓ స్త్రీ కూడ పాల్గొంది. ఆమె ఉద్ధరణం దానంతటదే మనలను రక్షించి వుండదు. నరజాతికి శిరస్సు క్రీస్తుకాని మరియుకాదు. క్రీస్తు సిలువమీద చనిపోక పోయినట్లయితే మరియు ఎంత కృషి చేసినా మనకు రక్షణం లభించి వుండదు. కాని క్రీస్తు రక్షణ కార్యంలో మరియు కూడ పాల్గొనడంవల్ల క్రీస్తుతో పాటు ఆమె కూడ మనలను రక్షించింది.

ఐనా క్రీస్తు రక్షణమూ మరియామాత రక్షణమూ ఒకేకోవకు చెందినవి గావు. క్రీస్తు మనకు అవసరమైన రక్షకుడు. అతడు లేక నరజాతికి రక్షణం లేదు. పౌలు వాకొన్నట్లు "దేవునికీ మానవునికీ మధ్య ఒక్కడు మధ్యవర్తి, క్రీస్తు -1తిమొు 2,5. ఇక మరియమాత రక్షణం క్రీస్తు రక్షణంలాగ అవసరమై గాదు. ఔచిత్యం కోసం మాత్రమే. ఏమిటి ఆ ఔచిత్యం?

అక్కడ మన పతనంలో ఓ ప్రీ పాల్గొంది అన్నాం. ఇక్కడ మన ఉద్ధరణంలో గూడ మళ్లా ఓ స్త్రీ పాల్గొంటే ఔచిత్యంగా వుంటుందనుకొని దేవుడు క్రీస్తుతో ఈమెను జోడించాడు. ఆ యేవకు ఈ యేవ సరితూగు. క్రీస్తులేక మరియలేదు. క్రీస్తు రక్షణం లేక మరియమాత రక్షణంలేదు. క్రీస్తు రక్షణానికి మరియమాత రక్షణం ఏమి చేర్చదు. ఆమె రక్షణాన్ని