ఈ పుట ఆమోదించబడ్డది

విశుద్ధరాలై వుంటుంది” అంటాడు -1కొ 7,34. కనుక మరియు కన్యగా వుండిపోయింది పూర్తిగా దేవునికి చెంది వుండడము కోసమే. ప్రభుని సంతోషపెట్టడం కోసమే. తన ప్రేమనంతా దేవునికి నైవేద్యం చేయడం కోసమే. అందుకే మానవమాత్రులు ఆమె ప్రేమను పంచుకోలేదు.

వివాహం క్రీస్తుకూ శ్రీసభకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. కాని కన్యత్వం క్రీస్తుకూ కన్యకూ వుండే ఐక్యభావం సూచిస్తుంది. క్రీస్తుకే వివాహమైన వధువు కన్య కావున మరియు పాపంలేకుండా పుట్టడానికీ, కన్యగా వుండి పోవడానికీ కారణం ఒక్కటే. దేవునికి తల్లి అయ్యేందుకు, దేవునికి అంకితమయ్యేందుకు. ఈలా కన్యగా వుండిపోయి మరియ నిండు హృదయంతో ప్రభువును ప్రేమించేది. పూర్వవేదం చదువుకుంటూ ఆ ప్రభువును ధ్యానించుకునేది. యెరూషలేము దేవాలయానికి వెళ్లి ఆ ప్రభువును ఆరాధించుకునేది. ఆ ప్రభువు పాపపులోకాన్ని ఉద్ధరించాలని వేడుకొంటూండేది. ఆమె ప్రార్ధనా ఫలితంగా ప్రభువు తన ప్రతినిధియైన మెస్సియాను సత్వరంగా భూమి మీదకు పంపాడు.

పూర్వవేదం కన్యత్వాన్ని పెద్దచూపు చూడలేదు. పూర్వ నూత్న వేదాల మధ్యకాలంలో జీవించిన కుమ్రాను భక్తులు మాత్రం కన్యత్వాన్ని ఆదరించారు. ఇక క్రీస్తు వచ్చాక నూత్న వేదంలో కన్నెరికానికి విలువ హెచ్చింది. ఈలా శ్రీసభలో కన్యత్వాన్ని స్థాపించి కన్యా జీవితానికి గౌరవ స్థానం కల్పించిన ప్రభువు, తన తల్లికి గూడ ఈ భాగ్యాన్ని ప్రసాదింపకపోడు గదా! டு)