ఈ పుట ఆమోదించబడ్డది
2. క్రీస్తు గీతం 2,6-11

ఈ గీతాన్ని పౌలు స్వయంగా వ్రాయలేదు. దీన్ని ఆనాడు దైవార్చనలో పాటగా పాడేవాళ్లు. తన భావాలను వ్యక్తం చేయడానికి బాగా సరిపోతుందన్న ఉద్దేశంతో పౌలు దీన్ని ఇక్కడ వాడుకొన్నాడు.

అసలు పౌలు దీన్ని ఇక్కడ ఎందుకు పేర్కొన్నాడు? ఫిలిప్పీయులు గర్వంతో పెద్దపదవులు ఆసిస్తున్నారు. వారికి వినయంలేదు. ఇంకా ఎవరిలాభం వాళ్లు చూచుకొంటున్నారు. అంతఃకలహాలతో సమాజంలో విభజనలు తెచ్చిపెడుతున్నారు -2,3-4. వాళ్లు క్రీస్తు నుండి వినయమూ స్వార్ణత్యాగమూ అనే రెండు గుణాలు నేర్చుకోవాలి. క్రీస్తు మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి అని చెప్తూ ఈ గీతాన్ని ఉదాహరించాడు -25.

ఈ పాటలో మూడంశాలు వున్నాయి. 6 చరణం క్రీస్తు పరలోక జీవితాన్ని వర్ణిస్తుంది. 7-8 చరణాలు అతని నరావతారాన్నీ వినయూన్నీ వర్ణిస్తాయి. 9-11 చరణాలు తండ్రి క్రీనుని మహిమపరచడాన్ని వర్ణిస్తాయి.

ఇక ఈ పాట విూద వివరణం చూద్దాం. 6. క్రీను నరావతారానికి ముందు పరలోకంలో దేవునితో తనకున్న సమానత్వాన్ని స్వార్థబుద్ధితో దక్కించు కోవాలనుకోలేదు. పూర్వం ఆదాము దేవునికి సరిసమానం కావాలనుకొని జ్ఞానవృక్షఫలం తిన్నాడు. అతడు నరుడైకూడ గర్వంతో దేవుణ్ణి కావాలనుకొన్నాడు. క్రీస్తు దేవుడై కూడా అణకువతో ఆ దైవత్వాన్ని వదలుకొన్నాడు. ఇద్దరికీ వ్యత్యాసం వుంది.

7. క్రీస్తు తన్నుతాను ఖాళీచేసికొని బానిస రూపాన్ని పొందాడు. అతడు వదలుకొంది దైవత్వాన్ని చేకొంది నరత్వాన్ని బానిసలకు శక్తీ అధికారమూ వుండవు. క్రీస్తు కూడ ఆలాగయ్యాడు.

8. క్రీస్తు వినయం మరణందాకా పోయింది. అది కూడ నీచాతినీచమైన సిలువమరణం. ఆనాడు దాసులకూ ద్రోహులకూ సిలువమరణం విధించే వాళ్లు. క్రీస్తు ఈలాంటి మరణానికి