ఈ పుట ఆమోదించబడ్డది

కలిపి తీసికొంటే బైబుల్లో కన్పించే ముఖ్యాంశాలు ఇవి. సృష్టి, తొలి పాపం, నిర్గమనం, నిబంధనం, రాజుల పరిపాలనం, బాబిలోనియా ప్రవాసం, ప్రవాసం నుండి తిరిగి రావడం, క్రీస్తు జననం, బోధలు అద్భుతాలు మరణోత్థానులు, తిరుసభ వ్యాప్తి క్రైస్తవ జీవితం, అంత్యగతులు మొదలైనవి.

బైబుల్లో ఐక్యతాభావం గోచరిస్తుంది. ప్రాత నిబంధనలో చెప్పిన విషయాలు నూత్న నిబంధనంలో నెరవేరతాయి. యూవే ప్రభువు, క్రీసూ వేరువేరు దేవుళు కాదు, ఒకే దేవుడు. బైబులు కథకూడ ఒకే రక్షణ గాధ. అది సృష్టితో ప్రారంభమై నరుని అంత్యగతులతో ముగుస్తుంది. బైబులు చివరకు చెడ్డ వోడిపోయి మంచి గెలుస్తుందని చెప్తుంది. అసలు బైబులంతా చెడ్డకూ మంచికీ కలిగే ఘర్షణను గూర్చే.

బైబుల్లోని ప్రధానమైన వ్యక్తి భగవంతుడు. అతడు నరుల పాపాన్ని తొలగించి వారికి రక్షణను దయచేస్తాడు. సంగ్రహంగా చెప్పాలంటే ఈ రక్షణ గాథే బైబులు. పవిత్ర గ్రంథాన్ని భక్తిశ్రద్ధలతో పఠించి అది బోధించే భగవంతుణ్ణి విశ్వసించి అతనినుండి ముక్తిని పొందడమే ఇప్పడు మనం చేయవలసిన పని.