ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారా నరులకు రక్షణం కలగడం. ఇక, ఈ మూడింటినీ పరిశీలిద్దాం.

1. సృష్టిలో క్రీస్తు పాత్ర 1,15-17 15.

క్రీస్తు మనకు దేవుణ్ణి ప్రత్యక్షం చేసేవాడు. సృష్టిలో అతడే మొదటివాడు. పూర్వవేదం ప్రభువు మొదటజానాన్ని కలిగించి దాని ద్వారా ఇతర వస్తువులను కలిగించాడని చెప్పంది - సామె 8,22. ఇక్కడ ఈ జ్ఞాన లక్షణాలను క్రీస్తుకి అన్వయించారు.

16. దేవుడు అన్ని వస్తువులను అందరు దేవదూతలను ఆక్రీస్తు ద్వారానే సృజించాడు. అన్నీ అతని ద్వారా అతని కొరకే వున్నాయి. సృష్టి అంతా క్రీస్తుకొరకే.

17. అతడు అన్నిటికంటె మొదటివాడు. సృష్టికి ముందే వున్నవాడు. అన్నివస్తువులు అతని విూదనే ఆధారపడి నిలుస్తాయి. ఫలితాంశం ఏమిటంటే, సృష్టి అంతా క్రీస్తుద్వారానే జరిగింది. క్రీస్తు మిరాదనే ఆధారపడి నిలుస్తుంది. దేవదూతలు క్రీస్తు కంటె తక్కువవాళ్లు కనుక వారిని ఆరాధించ కూడదు.

2. తిరుసభతో క్రీస్తుకి సంబంధం 1,18-19

18. విశ్వ శ్రీసభ అనే శరీరానికి క్రీస్తు శిరస్సు లేక నాయకుడు. క్రీస్తు విశ్వాసులు కలసి ఏకవ్యక్తి ఔతారని భావం. అన్ని వస్తువుల్లోను అతడే మొదటివాడు. చనిపోయిన వారిలో నుండి మొదట ఉత్థానమైంది అతడే. కనుక అన్నిటికంటె అతనికే ఎక్కువ ప్రాముఖ్యం వుంటుంది.

19. దేవుని సంపూర్ణత్వం, సర్వశక్తి అతనిలో నెలకొనివుంది.

3. క్రీస్తు మరణం ద్వారా రక్షణం 1,20 20. దేవుడు క్రీస్తుద్వారా సృష్టిని తనతో రాజీపరచుకొన్నాడు. సిలువపై అతడు చిందించిన నెత్తురు ద్వారా ఈ రాజీ జరిగింది. లోకమంతా క్రీస్తు మరణం ద్వారానే పాపపరిహారం పొందింది. అందరు నరులకు అతడే మధ్యవర్తి. ఇది క్రీస్తు గొప్పతనాన్ని చక్కగా వర్ణించే స్తుతిగీతం. యోహాను సువిశేషంలో మొదటి అధ్యాయంలోని మొదటి భాగం లాంటిది. మన ప్రార్థనకు బాగా ఉపయోగపడుతుంది.