పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/7

ఈ పుటను అచ్చుదిద్దలేదు

యాజకులు అతనికి అడ్డు వచ్చి అయ్యా! ఇది యాజకులు చేయవలసిన పని అని వారించారు. ఐనా అతడు వారి పలుకులు ఆలింపక మండిపడ్డాడు. వెంటనే దేవుడు అతని నొసటి మీద కుష్ట సోకేలా చేశాడు. యాజకులు అతన్ని దేవాలయం నుండి వెళ్లగొట్టారు. ఉజ్జీయా చనిపోయే వరకు కుష్టరోగి గానే వుండిపోయాడు. మళ్లా దేవాలయంలో అడుగు పెట్టక ఏకాంతంగా జీవించాడు. 88. యొషయాకు పిలుపు -యెష 6,1-8 యెషయా మాపటివేళ ధూపారాధన జరిగే సమయంలో యెరూ షలేము దేవాలయానికి వెళ్లాడు. అక్కడ, ప్రభువు అతనికి సింహాసనం మీద కూర్చుండి వున్న మహారాజులాగ దర్శన మిచ్చాడు. అతని చుటూ దేవదూతలు కొలువు చేస్తూ ప్రభువు పవిత్రుడు, ఈ లోకమంతా అతని సాన్నిధ్యంతో నిండివుంది అని పాడుతున్నారు. యెషయా నావన్నీ పాపపు మాటలే. నేను పాపపు నరుల మధ్య వసిస్తున్నాను. ఇప్పడు నేను దేవుణ్ణి కంటితో చూచాను. ఇక నేను చనిపోతానేమో నని భయపడ్డాడు. అప్పుడు దేవదూత బలిపీఠం మీది నుండి నిప్ప కణికను తీసికొని వచ్చి అతని పెదవులకు అంటించి దీని వల్ల నీ పాపం తొలగిపోయింది అని చెప్పాడు. ఈ దర్శనంలో యెషయాకు ప్రవచనం చెప్పే శక్తి వచ్చింది. దేవుడు ఎవడు నా దూతగా వెళ్లి ప్రజలకు నా సందేశం విన్పిస్తాడు అని దేవదూతలను సలహా అడుగుతుండగా యెషయా విన్నాడు. అతడు మీరు ఇప్పడే నా పెదవులు కాల్చి శుద్ధిచేశారు కదా! నన్ను పంపండి అన్నాడు. దేవుడు నీవు వెళ్లి జనానికి నా చిత్తాన్ని తెలియజేయి అన్నాడు. ఈలా యెషయా ప్రపక్త అయ్యాడు. ఆనాటి నుండి అతడు జనానికి ప్రభువు వాక్కులు విన్పించడం మొదలు పెట్టాడు. GD