పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/5

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాత నిబంధన కథలు-3 81. యోనా కథ ప్రభువు యోనా ప్రవక్తను నీనివే పౌరులకు పశ్చాత్తాపాన్ని బోధించమని ఆజ్ఞాపించాడు. వీళ్లు అన్యజాతివాళ్లు యిస్రాయేలు దేశానికి శత్రువులు. కనుక వీళ్లు పరివర్తనం చెంది దేవుని శిక్షను తప్పించుకోవడం యోనాకు ఇష్టంలేదు. కావున అతడు ఓడనెక్కి నీనివేకు పోక, దానికి ఇంకో వైపున వున్న తరీషు నగరానికి ప్రయాణమయ్యాడు. కాని దేవుడు సముద్రంలో పెద్ద తుఫాను రేపాడు. ఓడ మునిగిపోయేలా వుంది. నావికులు ఎవని పాపంవలన తుఫాను పట్టుకొందో తెలుసుకుండా మనుకొని చీట్లువేయగా యోనా తుఫానుకి కారకుడని తేలింది. వాళ్లు యోనాను వివరాలు అడగ్గా అతడు నేను దేవుని నుండి పారిపోతున్నానని చెప్పాడు. నావికులు భయపడి నీవు ఎంత పని చేశావు! మాకింత కీడు తెచ్చిపెట్టావు కదా అన్నారు. యోనా ఈ వుపద్రవానికి కారణం ಸೆ. నన్నెత్తి సముద్రంలో పడచేయండి. ఈ తుఫాను శాంతిస్తుంది అని చెప్పాడు. నావికులు ఆలాగే చేయగా తుఫాను వెంటనే సమసిపోయింది. ప్రభువు ఆజ్ఞపై ఓ తిమింగిలం యోనాను మ్రింగివేసింది. అతడు మూడు రోజులు చేపకడుపులో వుండిపోయాడు. అటు తర్వాత అది యోనాను ఒడ్డున వెళ్లగ్రక్కింది. రెండవసారి ప్రభువు యోనాను నీనివే నగరానికి వెళ్లి పశ్చాత్తాపాన్ని బోధించమన్నాడు. ఆ పట్టణం చాల పెద్దది. దాన్ని దాటిపోవాలంటే మూడురోజులు పడుతుంది. యోనా ఆ నగరానికి వెళ్లి మీరు పశ్చాత్తాప పడండి. లేకపోతే నలభైరోజుల్లో ఈ నగరం నాశమై పోతుంది అని బోధించాడు. అతని బోధను నమ్మి ఆ ప్రజలు పరితాపం చెందారు. రాజు, ప్రజలు, పశువులు ಸ తాల్చి ఉపవాసం చేసి తమ్మ క్షమించమని దేవుణ్ణి G2)