పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

బాలు ప్రవక్తలను కర్మెలు కొండమీద ప్రోగు జేశాడు. ప్రవక్త కూడ ప్రజలతో వచ్చాడు. రెండెద్దులను చంపి వాటి మాంసాన్ని బలిపీఠాలమీద పేర్చాలి. నిప్ప అంటించకూడదు. రెండు పక్షాల వాళ్లు వాళ్ల దేవుళ్లకు ప్రార్ధన చేయాలి. ఏ దేవుడు నిప్ప పంపి మాంసాన్ని కాల్చి వేస్తాడో అతడే నిజమైన దేవుడు. ఇదీ పందెం. మొదట బాలు ప్రవక్తలు మధ్యాహ్నం దాకా వారి దేవునికి ప్రార్థన చేశారు. మంత్రాలు వల్లించి నెత్తురు కారిందాకా తమ శరీరాలను కత్తులతో కోసుకున్నారు. ఐనా బాలు దేవత పలకలేదు. తర్వాత ఏలియా బలి పీఠాన్ని నిర్మించి దానిమీద ఎద్దు మాంసాన్ని పేర్చాడు. పీఠం మీద నీళ్లు పోసాడు. సాయంకాలం పూట దేవునికి ప్రార్ధన చేయగా వెంటనే నిప్పు దిగిచ్చి మాంసాన్నీ తడిసిన పీఠాన్నీ గూడ దహించి వేసింది. ప్రజలు యావే ప్రభువు ఒక్కడే దేవుడని కేకలు వేసారు. ఏలీయా ఓడిపోయిన బాలు ప్రవక్తలు 450 మందిని కీప్లోను వాగు దగ్గర చంపించాడు. ఈ పందెం ముగియగానే మూడేండ్ల కరువు ఆగిపోయి పెద్దావాన కురిసింది. ఇది యేలీయా చేసిన అద్భుతాలన్నిటిలోను గొప్పది. తర్వాత యెసెబెలు రాణి ఏలీయాను చంపిస్తానని బెదిరించింది. ప్రవక్త భయపడి హోరేబు కొండకు పారిపోయాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై అతనికి దైవసేవలో ధైర్యాన్ని బలాన్నీ ప్రసాదించాడు.

71. ఎలీషాకు పిలుపు - 1 రాజు 19, 19-21

ఎలీషా పండ్రెండు అరకలతో దుక్కిదున్నుతున్నాడు. తాను చివరి అరకను తోలుతున్నాడు. ప్రవక్త తన అంగీని తీసి అతనికి కప్పాడు. దానితో అద్భుతాలు చేసే యేలీయా శక్తి ఎలీషాకు సంక్రమించింది. అతడు ఎద్దులను చంపి మాంసం వండి తోడి పనివారికి భోజనం పెట్టాడు. పిమ్మట సేద్యం మానివేసి ఏలీయాకు శిష్యుడై అతన్ని అనుసరించాడు. యిస్రాయేలు దేశంలో యావే మతాన్ని నిలబెట్టే బాధ్యతను ఏలీయా తర్వాత ఏలీషా స్వీకరిస్తాడు.

72. నాబోతు ద్రాక్షతోట - 1 రాజు 21

యెస్రెయేలు నగరంలో ఆహాబు మేడ ప్రక్కనే నాబోతు అనే రైతుకి