పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

కూడ తమ దైవాలవైపు త్రిప్పారు. యిప్రాయేలీయులు అన్యజాతి వారిని పెండ్లాడరాదని ప్రభువు ముందుగానే ఆజ్ఞాపించాడు. సొలోమోనుకి ఏడువందలమంది భార్యలూ, మూడువందలమంది ఉపపత్నులూ వున్నారు. అతడు ఈ రాణులకు దేవాలయాలు కట్టించి వారి దైవాలకు పూజలు చేశాడు. తన తండ్రియైన దావీదు వలె యావే ప్రభువును పూర్ణ హృదయంతో సేవించలేదు. ప్రభువు రెండుసార్లు రాజుకు ప్రత్యక్షమై విగ్రహారాధనం మానుకొమ్మన్నా మానలేదు. కనుక ప్రభువు అతనిపై కోపించి నీ రాజ్యంలో పదివంతులు నీ సేవకునికి ఇచ్చివేస్తాను. ఒక్క వంతు మాత్రం నీ కుమారుని అధీనంలో వుంటుంది అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లే తర్వాత సొలోమోను రాజ్యం రెండుగా చీలిపోయింది.

67. సొలోమోను మరణం, రాజ్య విభజనం - 1 రాజు 11-12

సొలోమోను పోకడలు ఆనాటి పెద్దలకు నచ్చలేదు. వారిలో అహీయా ప్రవక్త వొకడు. యరోబాము సొలోమోను రాజ్యంలో వెట్టిచాకిరి చేసేవాళ్లకు పెద్ద సమర్ధుడైన పనివాడు. ఒకమారు అహీయా ప్రవక్త యరోబామును త్రోవలో కలసికొని తన క్రొత్త అంగీని దిడీలున పండ్రెండుముక్కలుగా చించాడు. యరోబాముతో నీవు వీటిలో పదిముక్కలు తీసికో, సొలోమోను అన్యదైవాలను కొల్చి దేవుని ఆజ్ఞ మీరాడు. అతని రాజ్యంలో పదివంతులకు నీవు రాజువెతావు. ఒక్కవంతు మాత్రం సొలోమోను కుమారుని వశంలో వుంటుంది. ఈ కార్యం ఆ కుమారుని కాలంలో జరుగుతుంది అని చెప్పాడు. సొలోమోనుకి ఈ సంగతి తెలిసింది. అతడు యురోబాముని చంపజూచాడు గాని అతడు ఈజిప్మకి పారిపోయాడు.

సొలోమోను నలభైయేండ్లు పరిపాలించి చనిపోయాడు. అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు. ప్రజల పెద్దలు అతన్ని సమీపించి నీ తండ్రి మాపై విధించిన పన్నులు తగ్గించమని వేడుకొన్నారు. కాని అతడు యువకుల సలహాలు పాటించి మా తండ్రి విధించిన పన్నులను తగ్గించను గదా, యింకా పెంచుతాను అని పరుషంగా మాటలాడాడు.