ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్దు పెట్టుకొన్నాడు. అన్నదమ్మలిద్దరూ ఆనందంతో కన్నీరు కార్చారు. ఏసావు తమ్మని ద్రోహం మరచిపోయి పెద్ద మనసుతో అతన్నిక్షమించాడు. యాకోబు అన్నకు కానుకలు అర్పించాడు. తర్వాత ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. యాకోబు కనాను దేశంలోని షెకెములో నివసించాడు.

15. యోసేపు కలలు - ఆది 37

యాకోబుకి పండ్రెండుమంది కుమారులు కలిగారు. వారిలో రాహేలుకి పుట్టిన యోసేఫంటే తండ్రికి ఎక్కువ ప్రీతి. కనుక అతనికి ముద్దుగా పొడుగు చేతుల నిలువటంగీని కుట్టించాడు. దాని వలన సోదరులకు యోసేఫు మీద అసూయ కలిగింది. పైగా యోసేపుకి రెండు కలలు వచ్చాయి. సోదరుల పనలు తన పనకు నమస్కారం చేసినట్లుగాను. సూర్యచంద్రులూ పదకొండు నక్షత్రాలూ తనకు దండం పెట్టినట్లుగానూ కలలు వచ్చాయి. తమ్ముడు అన్నలకు అధిపతి ఔతాడని ఆ కలల భావం కనుక సోదరులు అతన్ని ద్వేషించి చంపివేయగోరారు. మళ్లా చంపడ మెందుకు లెమ్మని వట్టిపోయిన బావిలో పడద్రోశారు. తర్వాత బావినుండి పైకితీసి యిస్రాయేలు వర్తకులకు అమ్మివేశారు. వాళ్లు అతన్ని ఈజిప్టుకి కొనిపోయి పోతీఫరు అనే సైనికాధికారికి అమ్మివేశారు. అన్నలు యోసేపు నిలువుటంగీని మేకపిల్ల నెత్తుటిలో ముంచి యాకోబు దగ్గరికి పంపించారు. కుమారుని ఏదో అడవిమృగం చంపివేసిందని చెప్పించారు. యాకోబు కొడుకు నిజంగానే చనిపోయాడనుకొని బట్టలు చించుకొని గోనె తాల్చి చాలరోజుల వరకు తీవ్రంగా దుఃఖించాడు.

16. పోతీఫరు భార్య నేరం మోపడం - ఆది 39

పోతీఫరు భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనింపమని ప్రలోభపెట్టింది. కాని యోసేపు అమ్మా! యజమానుడు నన్ను నమ్మి నిన్నొక్క దానిని తప్ప ఈ యింటిలోని సంగతులన్నీ నాకు ఒప్పజెప్పాడు. నేను యజమానునికీ దేవునికీ ద్రోహం చేయకూడదు అని చెప్పాడు. ఒకరోజు ఆమె యోసేఫు పైబట్ట పట్టుకొని తనతో శయనింపమని నిర్బంధం చేసింది. అతడు ఆ బట్టను అక్కడే వదలిప్తి వెలుపలికి పారిపోయాడు. తర్వాత