ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మళ్లా కంటితో చూడనేలేదు. ఏసావు అన్యజాతి వారైన హితీయుల పిల్లలను పెండ్లిచేసికోగా వాళ్లు అత్తమామలను చాల విసిగించారు. ఈసాకు రిబ్కా యిద్దరూ పక్షపాత బుద్ధితో వ్యవహరించి పిల్లలను చెడగొట్టారు.

13. బేతేలు వద్ద యాకోబుకి దైవదర్శనం - 28, 10-22

యాకోబు అన్న నుండి పారిపోయి హారానుకి వెళూ దారిలో ఒకచోట రాత్రి నిద్రపోయాడు. అతనికి కలలో దేవదూతలు నిచ్చెన మీదిగా ఎక్కుతూ దిగుతూ వున్నట్లుగా కన్పించారు. అనగా అతడు దైవసాన్నిధ్యంలో వున్నాడని భావం. దేవుడు అతనితో నేను నీ తండ్రితాతలు కొలిచిన దేవుణ్ణి సుమా! ఈ ప్రదేశాన్ని నేను నీ సంతతికి ఇస్తాను. నీకు ఎప్పడూ సహాయం చేస్తుంటాను. నిన్ను మళ్లా సురక్షితంగా ఈ తావుకి తీసికొని వస్తాను అని చెప్పాడు. యాకోబు మేల్కొని ఆ కలను తలంచుకొని భయపడ్డాడు. ఇది దేవుడు వసించే తావు అనుకొన్నాడు. తాను తలదిండుగా వాడుకొన్న రాతిని తీసి పవిత్ర స్తంభంగా నాటి దానిమీద తైలంపోసి అభిషేకం చేశాడు. ఓ దేవాలయం లాంటిదాన్ని ఏర్పాటు చేశాడు. ఆ చోటికి బేతేలు, అనగా దేవుని యిల్లు అని పేరు పెట్టాడు. యాకోబు దేవుడు నన్ను మళ్లా భద్రంగా మా యింటికి తీసికొని వస్తాడు అని నమ్మాడు. తన సంపాదనలో పదవ వంతు దేవునికి కానుకగా యిస్తానని మొక్కుకొన్నాడు.

14. ఏసావు తమ్ముని క్షమించడం - ఆది33

యాకోబు మేనమామ లాబాను ఇంటిలో 14 ఏండ్లు గడిపాడు. అతని కొమార్తెలు లెయా రాహేలులను పెండ్లి జేసికొన్నాడు. సిరిసంపదలు ఆర్జించి ఆలుబిడ్డలతో కనాను దేశానికి తిరిగి వస్తున్నాడు. తమ్ముడు వస్తున్నాడని తెలిసికొని ఏసావు నాలు వందల మంది అనుచరులను ప్రోగుజేసికొని అతన్ని కలుసుకోవడానికి ఎదురు వచ్చాడు. పూర్వవైరం వలన అన్నను చూడగానే తమ్మనికి హడలు పుట్టింది. అతడు అన్న ముందు ఏడుసార్లు నేలమీద బోర్లపడి నమస్కారం చేశాడు. ఏసావు తమ్మునిమీద పగతీర్చుకోవడానికి గాక అతన్ని ప్రేమతో ఆహ్వానించడానికి వచ్చాడు. కనుక పరుగెత్తుకొని ఫ్రో కౌగిలించుకొని మెడమీద