ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటి పట్టుననే వుండేవాడు. ఒకసారి యేసావు వేటకు వెళ్లి అక్కడ యేమీ దొరకనందున అలసిపోయి వట్టి చేతులతో తిరిగివచ్చాడు. ఇంటిపట్టున యాకోబు కమ్మని పులుసు చేసివుంచాడు. ఏసావు ఆ పులుసు త్రాగగోరాడు. యాకోబు నీ జ్యేష్ట భాగం వదులుకొంటే ఈ పులుసు నిస్తానని షరతు పెట్టాడు. యేసావు తేలిక మనిషి. జ్యేష్ఠభాగాన్ని వొదలుకొని పులుసు త్రాగి నెమ్మదిగా వెళ్లిపోయాడు.

12. యాకోబు అన్నను మోసగించడం - ఆది 27

ఈసాకు పండు ముసలి అయ్యాడు. కంటి చూపు కూడ కోల్పోయాడు. మరణం దాపులోనే వుందని గ్రహించాడు. పెద్ద కొడుకు ఏసావును పిలచి జింకను వేటాడి మాంసం తెచ్చి వండిపెట్టు. చనిపోక ముందు నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. ఆ దీవెన పొందినవాళ్లు బాగా వృద్ధి చెంది తండ్రి వంశాన్ని నిలబెడతారు. సరే, యేసావు వేటకు వెళ్లాడు. ఈసాకు మాటలు తల్లి రిబ్కా వింది. ఆమె తండ్రి దీవెన చిన్న కొడుకు యాకోబుకి దక్కాలనుకొంది. అతన్ని యేసావులా నటించమని చెప్పింది. మేక పిల్లను చంపి తండ్రికి ఇష్టమైన రీతిలో మాంసం వండింది. యాకోబుని యేసావు దుస్తులు ధరించమని చెప్పింది. అతని చేతులకు మేకపిల్ల తోళ్లు కప్పింది. యాకోబు భోజనం తీసికొనిపోయి తండ్రిని దీవించమని అడిగాడు. గ్రుడ్డివాడైన ఈసాకు కుమారుని తవిడి చూచి నాయనా! నీ గొంతు యాకోబు గొంతు. కాని నీ వొడలు యేసావు వొడలు అని పల్కి భోజనం ఆరగించి యాకోబు ఏసావే అనుకొని అతన్ని దీవించాడు. దానివల్ల యాకోబుకి సిరిసంపదలు కలుగుతాయి. అతడు అన్నకు అధిపతి కూడ ఔతాడు. తర్వాత ఏసావు వేట మాంసంతో తిరిగివచ్చి భోజనం సిద్ధం జేసికొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈసాకుకి యాకోబు మోసం అర్థమైంది. ఏసావు నిరాశ చెంది తన్ను కూడ దీవించమని బతిమాలాడు కాని ඡෆ(ශ්‍රී దీవెన ఫలించేది ఒక్కసారే. ఏసావు తమ్మని వలన రెండుసార్లు నష్టపోయినందుకు ఆగ్రహించి అతన్ని చంపాలని నిశ్చయించుకొన్నాడు. రిబ్కా చిన్నకొడుకుని హారానులోని మేనమామ లాబాను దగ్గరికి పంపిత్లాప్రుని తప్పించింది. ఆమె యాకోబుని