ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చి దేవునికి దహనబలిగా సమర్పించాడు. అతడు దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు. తాను దేవునికి విధేయుడననీ, దైవభక్తి కలవాడననీ రుజువు చేసికొన్నాడు. తనకు ఈసాకు కంటె దేవుడే యెక్కువని నిరూపించు కొన్నాడు. దేవుడు అబ్రాహాము భక్తికి సంతసించి అతని సంతానాన్ని అంసఖ్యాకంగా వృద్ధి చేస్తానని మళ్లా శపథం చేశాడు. తర్వాత వెయ్యేండ్లకు సొలోమోను రాజు ఆ తావననే దేవాలయం నిర్మించాడు.

10. ఈసాకు రిబ్కాల వివాహం - ఆది 24

అబ్రాహాము తన కుమారుడైన యీసాకుకి పెండ్లి చేయగోరాడు. కనానీయుల పిల్లను గాక తన బంధువుల అమ్మాయిని కోడలినిగా జేసికోవాలనుకొన్నాడు. కనుక నమ్మకంగల పెద్ద సేవకుడు యేలీయెసరుని హారానుకి పంపాడు. ఆ సేవకుడు ఒంటెలతో పోయి ఆ వూరి బావి దగ్గర ఆగాడు. ఓ ప్రభూ! నాకూ నా వొంటెలకు నీళ్లు తోడిపోసే బాలికే మా యజమానునికి కోడలు అగును గాక అని దేవునికి ప్రార్ధన చేశాడు. ఆ సమయానికి అబ్రాహాము తమ్ముడు నాహోరు మనుమరాలైన రిబ్కాబావికి నీళ్లకు వచ్చింది. సేవకుడు అడగగానే ఆమె అతనికీ వొంటెలకూ నీళ్లు తోడి పోసింది. ఆ బాలికే దేవుడు నిర్ణయించిన వధువు అని గ్రహించి సేవకుడు ఆమె యింటికి పోయి అక్కడే బస చేశాడు. ఆ యింటి వారికి కానుకలు సమర్పించి తాను వచ్చిన పని తెలియజేశాడు. తల్లిదండ్రులతో పాటు రిబ్కాకూడ ఈసాకుని పెండ్లియాడ్డానికి సమ్మతించింది. సేవకుడు బాలికను తీసికొని అబ్రాహాము దగ్గరికి తిరిగి వచ్చాడు. తండ్రి కొడుకునకు పెండ్లిచేశాడు. రిబ్కా చాలాయేండ్ల పాటు గొడ్రాలుగా వుండిపోయింది. తర్వాత కవల బిడ్డలను కంది. వారే యేసావు, యాకోబులు. దేవుడు భక్తుల కోర్కెలు తప్పక తీరుస్తాడు.

11. యాకోబు ఏసావు జ్యేష్ట భాగాన్ని కొట్టేయడం - ෂුයි 25,27-34

ఏసావు జింకలను వేటాడి తండ్రికి మాసం తెచ్చి యిచ్చేవాడు. కనుక ఈసాకుకి అతడంటే యిష్టం. తల్లికి యాకోబు ఇష్టం. అతడు