ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. దేవుడు సొదొమను నాశం చేయడం - ఆది 18, 16-33

సౌదొమ గొమర్రా ప్రజలు బరితెగించి పోయారు. కనుక దేవుడు ఆ నగరాలను నాశం చేయాలని నిశ్చయించుకొన్నాడు. అబ్రాహాము ఆ పట్టణాల కొరకు దేవునికి విజ్ఞాపనం చేశాడు. అక్కడ యాభైమంది సజ్జనులుంటే ఆ వూళ్లను కాపాడమని వేడుకొన్నాడు. కాని అక్కడ అంతమంది మంచివాళ్లు ඒජා. తర్వాత అతడు అక్కడ 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, పదిమంది సజ్జనులుంటే ఆ వూళ్లను క్షమించమని వరుసగా దేవుణ్ణి వేడుకొంటూ వచ్చాడు. కాని అక్కడ పదిమంది నీతిమంతులు కూడ లేరు.

సౌదొమ నగరంలో అబ్రాహాము తమ్మని కుమారుడైన లోతు, అతని కుటుంబం వసిస్తున్నారు. దేవదూత వారిని ఆ నగరం నుండి వెళ్లి పొండని ఆజ్ఞాపించాడు. మీరు వెనుకకు తిరిగి చూడవద్దని హెచ్చరించాడు. వారు వెళ్లిపోగానే దేవుడు అగ్నిగంధకం కురిపించి నగరాలను కాల్చివేశాడు. దారిలో లోతు భార్య కుతూహలం కొద్ది వెనుకకు తిరిగి చూచింది. ఆలా చూడగానే ఉప్పస్తంభంగా మారిపోయింది -19,23-24. 9.

అబ్రాహాము ఈసాకుని బలిగా సమర్పించడం - ఆది 22

అబ్రాహాము సారాలకు లేకలేక ముసలిప్రాయంలో ఈసాకు అనే కొడుకు పుట్టాడు. కాని దేవుడు అతనితో నీవు గాఢంగా ప్రేమించే నీ యేకైక కుమారుని మోరియా కొండమీద నాకు దహనబలిగా సమర్పించ మని ఆదేశించాడు. అంతకు ముందే దేవుడు ఈ పిల్లవాడి ద్వారా అబ్రాహాము సంతతి ఆకాశంలోని చుక్కల్లాగ అనంతంగా వ్యాపిస్తుందని మాట యిచ్చాడు. ఈసాకు చనిపోతే ఆ ప్రమాణం ఏలా నెరవేరుతుంది? ఐనా అబ్రాహాము వెనుకాడలేదు. దేవుని మీద మొరపడలేదు. అతన్ని తిట్టి పోయలేదు. దేవుని ఆజ్ఞకు బద్దుడై కుమారుని కొండమీదికి తీసికొని పోయి బలివేదికను నిర్మించాడు. ఈసాకుని చంపి కాల్చివేయడానికి కత్తి దూశాడు. కాని దేవదూత అడ్డు వచ్చి కుమారుని చంపనీయలేదు. అబ్రాహాము ప్రక్క పొదలో కొమల్ర్యని వున్న పొట్టేలిని తీసికొని