ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోరులో సీసా సైన్యం వోడిపోయింది. సీస్రా పారిపోయి హేబెరు భార్య యాయేలు గుడారంలో తలదాచుకొన్నాడు. ఆమె అతన్ని ఆహ్వానించి త్రాగడానికి మజ్జిగ నిచ్చి కంబళితో కప్పింది. సీస్రా బాగా అలసిపోయి వున్నందున మైమరచి నిద్రపోయాడు. యాయేలు గుడారపు మేకు తీసికొని నిద్రలో వున్న సీప్రా కణతల్లో దిగగొట్టగా అతడు ప్రాణాలు విడిచాడు. బారాకు సీస్రాను తరుము కొంటూ వచ్చి చచ్చిపడివున్న వాణ్ణి చూచాడు. సైన్యాధిపతి చనిపోగా యూబీను బలముడిగి యిస్రాయేలీయులకు లొంగిపోయాడు. యాయేలు అతిధిని నమ్మించి మోసం చేసింది. కాని ಆಮ యుద్ధంలో యిస్రాయేలు పక్షాన్ని ఎన్నుకొంది. దేవుడు ఒక అబలద్వారా మహావీరుణ్ణి మన్ను కరిపించాడు. 40. యెఫా వ్రతం - న్యాయాధి 11,29-40 అమ్మోనీయులు గిలాదు మండలంలోని యిస్రాయేలీయులను పీడించారు. గిలాదు పౌరులు యెఫాను న్యాయాధిపతిగా నాయకుణ్ణిగా ఎన్నుకొని శత్రువుల మీదికి యుద్ధానికి పంపారు. అతడు మహాశూరుడు. అతడు దేవునికి మ్రొక్కుకొన్నాడు. ఈ యుద్ధంలో నీవు నాకు విజయాన్ని ప్రసాదిస్తే నేను పోరునుండి తిరిగివచ్చినపుడు నాకు ఎదురువచ్చిన వారిని నీకు బలిగా అర్పిస్తాను అని వ్రతం పట్టాడు. యెప్తా ఏ జంతువో లేక ఏ బానిసో ఎదురు వస్తారు అనుకొన్నాడు. పోరులో యెఫా గెల్చాడు. కాని అతడు ఇంటికి తిరిగివచ్చినపుడు అతని కూతురే నాట్యం జేస్తూ తండ్రికి స్వాగతం జెప్పడానికి ఎదురు వచ్చింది. ఆమె అతనికి ఒక్కతే బిడ్డ ఆ బలికను చూడగానే యెఫాకు గుండెలు పగిలాయి. ఐనా తన వ్రతాన్ని నిలబెట్టుకోగోరాడు. ఆ బాలిక రెండు నెలలపాటు కొండల్లోకిపోయి నిష్ఫలమైపోయిన తన కన్యత్వాన్ని తలంచుకొని శోకించివచ్చింది. తండ్రి తాను దేవునికి మాటయిచ్చినట్లే కూతురుని బలియిచ్చాడు. యిస్రాయేలు స్త్రీలు ఆ బాలికను తలంచుకొని ఏటేట నాలురోజులు శోకించడం ఆచార మైంది. యెఫా లాగ తొందరపాటు ప్రమాణాలు చేయకూడదు. దేవుణ్ణి ఏ పద్ధతిలో పూజించాలో తెలివృ