ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సైనికులు అక్కరలేదు. వీళ్లు తర్వాత మా బలంతో మేమే గెల్చామని గొప్పలు చెప్పకొంటారు. నీ సైన్యాన్ని తగ్గించు అని చెప్పాడు. గిద్యోను యుద్ధానికి భయపడేవాళ్లంతా వెళ్లిపోండి అని చెప్పగా చాలమంది తిరిగిపోయారు. కేవలం 300 మందితో మాత్రమే గిద్యోను యుద్ధానికి పోయాడు. శత్రుసైన్యం 35 వేలమంది వున్నారు. గిద్యోను సైనికులు అర్థరాత్రిలో బూరలు చేతబట్టి కుండల్లో దీపాలు పెట్టుకొని శత్రుశిబిరం దగ్గరికి వచ్చారు. దిడీలున కుండలు పగలగొట్టి దీపాలు చూపించారు. బూరలను ఊదారు. ఆ శబ్దానికీ వెల్లురుకీ శత్రువులు కలవరపడి లేచారు. బెదిరిపోయి దిక్కుదోచక తమపక్షం వారినే ఒకరి నొకరు చంపుకొన్నారు. మిగిలినవాళ్లు పారిపోయారు. గిద్యోను సైనికులు వారిని వెన్నాడి తరిమికొట్టారు. ఈ రీతిగా ప్రభువు కొద్దిపాటి సైన్యంతోనే గిద్యోనుకి విజయాన్ని ప్రసాదించాడు 39. సీస్రా వధ - న్యాయాధి 4 యిస్రాయేలీయులు ధర్మశాస్తాన్ని మీరి పాపం కట్టుకోగా యావే వారిని కోపించి కనాను రాజయిన యాబీనుకి దాసులను చేశాడు. ఆరాజు వారిని ఇరవైయేండ్ల పీడించాడు. అతని సైన్యాధిపతి సీప్రా. ఆరోజుల్లో లప్పీడోతు భార్య డెబోరా న్యాయాధిపతి. ప్రభువు ఆమెను ప్రేరేపించాడు. ఆమె యుద్ధవీరుడైన బారాకును పిలిపించి నీవు పదివేలమంది సైనికులతో బోయి కీపోను వాగు దగ్గర సీప్రాతో యుద్ధంచేయి. ప్రభువు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పింది. కాని బారాకు దడిశాడు. నీవు గూడ సైన్యంతో వస్తే నేను యుద్ధం జేస్తాను అన్నాడు. దెబోరా నేను తప్పక వస్తాను. కాని సీప్రాను వోడించిన కీర్తి నీకుగాక ఓ ఆడగూతురుకి దక్కుతుంది అని ప్రవచించింది. కీప్లోను నది దగ్గర ఉభయ సైన్యాలు తారసిల్లాయి. బారాకు పదివేలమంది యోధులతో వచ్చాడు. సీప్రా 900 ఇనుపరధాలతోను లక్షమంది సైన్యంతోను వచ్చాడు. కాని ప్రభువు బారాకు సైన్యాన్ని చూడగానే సీస్రా దండుకి కలవరం పుట్టేలా చేశాడు. ఆ సమయంలో వానకురిసి సీస్ర రధాల్లు బురదలో కూరుకొన్నాయి. కనుక