ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడారంలో దాచిపెట్టుకొన్నాడు. దానివలన యావే కోపించి యుద్ధంలో యిస్రాయేలు సైనికులు ఓడిపోయేలా చేశాడు. యోషువా ఆజ్ఞపై ఆకానునీ అతని కుటుంబాన్నీ రాళ్లతో కొట్టి చంపివేశారు. అతడు దేవుని ఆజ్ఞమీరినందుకు అది శిక్ష తర్వాత సైనికులు హాయి పట్టణాన్ని రెండవసారి ముట్టడించి గెల్చారు. 37. ఏహూదు ఎగ్లోనుని జయించడం - న్యాయాధి 3 కనాను దేశంలో మోవాబు రాజైన ఎగ్లోను యిస్రాయేలీయులను జయించి వారిని పద్దెనిమిది యేండ్లు దాసులనుగా ఏలాడు. ప్రభువు అతన్ని ఓడించడానికి ఏహూదు అనే న్యాయాధిపతిని ఎన్నుకొన్నాడు. అతడు పురచేతి యోధుడు. ఏహూదు ఎగ్లోనుకి కప్పం కట్టడానికి ಓಬು తీసికొని వచ్చి రాజా! నేను నీకొక దైవసందేశాన్ని విన్పించాలి అని చెప్పాడు. రాజు సేవకులందరినీ వెలుపలకు పంపివేసి మీది గదిలోనికి వెళ్లాడు.ఏహూదు తన ఉడుపుల్లో పెద్ద కత్తిని దాచాడు. పురచేతితో కత్తిదూసి ఎగ్లోను పొట్టలో పొడిచాడు. ఆరాజు బాగా బలసినవాడు. కత్తీ దాని పిడికిలీ అతని పొట్టలో దూరగా కొవ్వు వెలుపలికి వచ్చింది. ఆలా రాజు చనిపోగా ఏహూదు అనుచరులు మోవాబు వీరులతో యుద్ధం జేసి వారిని ఓడించారు. దాస్యం నుండి తప్పించుకొన్నారు. 38. గిద్యోను చిన్న దండు - న్యాయాధి 7 మిద్యానీయులు యిస్రాయేలీయులను ఏడేండ్లపాటు పీడించి పిప్పి చేశారు. శత్రువులను ఓడించి తన ప్రజలను కాపాడ్డానికి ప్రభువు గిద్యోనుని ఎన్నుకొన్నాడు.ఆ వీరుడు దేవునికి పరీక్ష పెట్టాడు. తాను కళ్లంలో గొర్రెవున్ని పెట్టగా అది మాత్రమే మంచులో తడిసి కళ్లమంతా పొడిగా వుండాలి. అతడు కోరినట్లే జరిగింది. అతడు మళ్లా రెండవ పరీక్ష పెట్టాడు. ఈసారి ఉన్ని పొడిగా వుండి కళ్లమంతా మంచులో తడవాలి. మళ్లా అతడు కోరినట్లే జరిగింది. కనుక దేవుడు గిద్యోను ద్వారా యిస్రాయేలును రక్షిస్తాడని రుజువైంది. ఇకనేం, గిద్యోను 32వేలమంది సైనికులను ప్రోగు జేసికొని మిద్యానీయుల మీదికి యుద్ధానికి ప్రోయాడు. కాని ప్రభువు ఇంతమంది