ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులువుగా జయించవచ్చుననీ బాలాకు పన్నాగం. మొదటిసారి పిలువగా రాలేదు గాని, రెండవసారి కూడ పిలువగా బిలాము గాడిద నెక్కి పయన మయ్యాడు. కాని అతని రాక దేవునికి ఇష్టంలేదు. దారిలో బిలాము గాడిద కత్తి చేతబట్టుకొని వున్న దేవదూతను చూచి భయపడి ప్రక్క పొలంలోనికి తప్పకొంది. బిలాము దేవదూతను చూడలేదు. గాడిదను కర్రతో బాది దారికి మరల్చాడు. రెండవమారు అది దేవదూతను చూచి భయపడి గోడప్రక్కగా పోగా బిలాము కాలు గోడకు రాచుకొంది. అతడు మళ్లా దాన్ని కొట్టాడు. మూడవసారి అది తనకు అడ్డముగా నిలబడివున్న దేవదూతను చూచి ముందుకు కదలలేక నేలమీద చతికిలబడింది. బిలాము మళ్లా దాన్ని చావమోదాడు. గాడిద నీవు ఇప్పటికి మూడుసార్లు నన్ను కొట్టావు. నేను నీకు ఏమి యపకారం చేశాను అని అడిగింది. అతడు నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావు. నా చేతిలో కత్తి వుంటే ఈపాటికి నిన్ను నరికి వేశేవాణ్ణి అన్నాడు. అప్పడు బిలాముకి కూడ దేవదూత కన్పించాడు.అతడు き。 ప్రయాణం నాకు ఇష్టంలేదు. నీ గాడిద మూడుసార్లు నన్ను జూచి తప్పకొందిగాని లేకపోతే నిన్ను చంపివేసి దాన్ని వదిలివేసే వాణ్ణి. నీవు బాలాకు దగ్గరికి వెళ్లినప్పడు నేను పలకమన్న పలుకులు మాత్రమే పలకాలి సుమా అని ఆదేశించాడు. తర్వాత బాలాకు దూరంగా విడిది చేసివున్న యిస్రాయేలీయులను బిలాముకి చూపించి నీవు వీరిని శపించు అని చెప్పాడు. కాని బిలాము దైవప్రేరితుడై వారిని శపించడానికి బదులుగా దీవించాడు. ఈలా మూడుసార్లు జరిగింది. బాలాకు కోపించి ఏ బహుమతి ఈయకుండానే బిలాముని పంపివేశాడు. 34. మోషే మరణం - ద్వితీ 34 మోషేకు 120 ఏండ్లు వచ్చాయి. అతడు నెబో కొండమీది పిస్లా శిఖరాన్ని ఎక్కాడు. అక్కడి నుండి ప్రభువు కనాను దేశాన్ని అంతటినీ చూపించాడు. అతడు మాత్రం ఆ దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మోషే యోషువాను తనకు అనుచరునిగా ప్రకటించాడు -సంఖ్యా 27,2223. ఇతడు ప్రజలను కనాను దేశానికి చేరుస్తాడు. చనిపోయే వరకు