ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చాలా పొడవుగా వున్నారనీ చెప్పారు. మనం వాళ్లను జయించలేము అని పల్మారు. ఆమాటలు విని జనం భయపడి నిరుత్సాహం చెందారు. ఇంకో నాయకుణ్ణి ఎన్నుకొని ఈజిప్టుకి తిరిగిపోతే బాగుంటుందిఅనుకొన్నారు. పండ్రెండుమంది వేగుల వారిలో యోషువా, కాలెబు మాత్రం దైవ సహాయంతో ఆ దేశాన్ని జయించవచ్చు అని పల్మారు. ఐనా ప్రజలు వారి మాటలు వినక తిరగబడ్డారు. ఆజనం తన శక్తినీ సహాయాన్నీ నమ్మనందుకు దేవుడు ఆగ్రహం చెందాడు. వారిలో ఇరవైయేండ్లకు పైబడినవాళ్లు ఎవరూ కనాను దేశంలో అడుగుపెట్టక ఎడారిలోనే చనిపోతారని చెప్పాడు. యోషువా కాలెబులు మాత్రం ఈ శాపానికి మినహాయింపు. ఇంకా ఆ ప్రజలు 40 ఏండ్లపాటు ఎడారిలోనే తిరుగాడుతుంటారని గూడ చెప్పాడు. మనం కనాను దేశాన్ని జయించలేము అని చెప్పి ప్రజలను నిరుత్సాహ పరచిన పదిమంది వేగుల వాళ్లను రోగంతో చంపివేశాడు. 32. కంచుసర్పం - సంఖ్యా 21,4-9 ఎడారి, ప్రయాణంలో ప్రజలు విసిగిపోయారు. రోజూ యీ రుచీపచీలేని మన్నా భోజనమేనా అని మోషే మీద తిరగబడ్డారు. దానికి శిక్షగా ప్రభువు విషసర్పాలను పంపగా అవి చాలమందిని కరచి చంపాయి. ప్రజలు మేము తప్ప చేశాం. నీవు ఈ పాముల బెడదను తొలగించమని దేవునికి మనవి చేయి అని మోషేను వేడుకొన్నారు. దేవుని ఆజ్ఞపై మోషే కంచుసర్పం చేసి గడెమీద తగిలించాడు. దానివైపు చూచినవాళ్లు పాము కాటునుండి తప్పించుకొన్నారు. ఇక్కడ కంచుసర్పం ప్రజలను రక్షించలేదు. ஆகி వట్టి బొమ్మ 89 బొమ్మవైపు చూడ్డం ద్వారా ప్రజలు దేవునికి విధేయులయ్యారు. ఆ బొమ్మద్వారా దేవుడే ప్రజలను కాపాడాడు. 33. బిలాము గాడిద మాటలాడ్డం - సంఖ్యా 22 యిస్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం చేస్తూ మోవాబు దేశం దగ్గరికి వచ్చారు. ఆ దేశపు రాజైన బాలాకు వారికి భయపడి పేతోరు నివాసి మాంత్రికుడునైన బిలాము దగ్గరికి దూతలను పంపాడు. బిలాము వచ్చి శపిస్తే యిప్రాయేలు బలం ఉడ్రిగిపోతుందనీ అప్పడు తాను వారిని