ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిర్యాముకి కుష్టసోకింది. అన్నా అక్కాయిద్దరూ పశ్చాత్తాపపడ్డారు. మోషే అక్క తరపున దేవునికి మనవి చేశాడు. ప్రభువు కరుణించి మిర్యాముకి ఆరోగ్యం దయచేశాడు. ఆమెను ప్రజలనుండి ఏడు రోజులపాటు వెలివేసి మళ్లా శిబిరానికి రానిచ్చారు. 30. కోరా తిరుగుబాటు - సంఖ్యా 16 కోరా, దాతాను, అబీరాము అనే లేవీయులు మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. మీతో పాటు మేము కూడ ఈ సమాజానికి నాయకులమే అని వాదించారు. 250 మంది పెద్దలు కూడ వారితో చేరిపోయారు. మోషే ప్రజలందరినీ ప్రభువు గుడారం ముందు ప్రోగుజేశాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై తిరుగుబాటు చేసిన వారిని ఖండించాడు. పై ముగ్గురు తమ గుడారాలకు వెళ్లిపోయారు. అక్కడ నేల బ్రద్దలై వారిని వారి కుటుంబాలను మ్రింగివేసింది. అగ్ని దిగివచ్చి 250 మంది తిరుగుబాటు దారులను కూడ కాల్చివేసింది. మరునాడు సమాజంలోని జనం మీరు యావే ప్రజలను చంపివేశారు కదా అని మోషే అహరోనుల మీద గొణిగారు. ప్రభువు వారిపై కోపించి అంటురోగం పంపాడు. దానివల్ల జనంలో 14,700 మంది చనిపోయారు. అహరోను సాంబ్రాణి పొగవేసి ప్రజల తిరుగుబాటుకి ప్రాయశ్చిత్తం చేయగా అంటురోగం సమసిసోయింది. యిస్రాయేలు ప్రజలు తలబిరుసు జనం. వాళ్లు ఒకపెట్టున పాఠం నేర్చుకునే వాళ్లు కాదు. 31. వేగు చూడబోయినవాళ్లు - సంఖ్యా 13-14 యిప్రాయేలు ప్రజలు కాడేషువద్ద విడిది చేశారు. మోషే తెగకు ఒక్కని చొప్పన పండ్రెండుమందిని ఎన్నుకొని వారిని కనాను దేశాన్ని వేగుచూడ్డానికి పంపాడు. వాళ్లు నలభై రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ దేశంలో కాసిన పెద్దద్రాక్ష గుత్తిని కర్రకు వ్రేలాడగట్టుకొని ఇద్దరు నరులు మోసికొని వచ్చారు. ఇంకా అచటి దానిమ్మపండూ అంజూరాలు తీసికొని వచ్చారు. ప్రజలను పోగుజేసి ఆ దేశసమాచారం తెలియజేశారు. అక్కడి పట్టణాలు ప్రాకారాలతో బలిష్టంగాశ్రియ అచటి నరులు రాక్షసుల్లాగ