ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని మోషేతో జగడమాడారు. దేవుని ఆజ్ఞపై మోషే పెద్దలతో పోయి కొండమీది రాతిబండను కర్రతో బాదాడు. అద్భుతంగా బండనుండి నీళ్లు పారాయి. జనం ఆ నీళ్లు త్రాగి సంతోషించారు. ఆ చోటికి మస్సా, మెరీబా అని పేర్లు వచ్చాయి. మస్సా అంటే జగడమాడ్డం, మెరీబా అంటే పరీక్షించడం. 28. బంగారు దూడను ఆరాధించడం - నిర్గ 32 మోషే కొండమీదికి వెళ్లి దేవుని సన్నిధిలో వుండిపోయి నలభైరోజుల వరకు దిగిరాలేదు. ప్రజల విశ్వాసం చలించింది. వాళ్లు అహరోనుతో ఆమోషేకు ఏమీ కీడు మూడిందో మాకు తెలియదు. నీవు మాకొక క్రొత్త దేవరను చేసిపెట్టు అన్నారు. అహరోను స్త్రీల నగలను కరిగించి బంగారు దూడను పోతపోశాడు. అది ఆ రోజుల్లో కనానీయులు కొల్చే బాలు దేవతకు చిహ్నం. ప్రజలు ఆ దూడకు బలులు సమర్పించారు. మనలను ఈజిప్టు నుండి తోడ్కొని వచ్చిన దేవర యితడే అని అరచి చిందులు త్రోక్మారు. అంతలో మోషే పదియాజ్ఞల రాతి పలకలు తీసికొని కొండ దిగివచ్చాడు. ప్రజల విగ్రహారాధనను చూచి ఆగ్రహం చెంది రాతి పలకలను అక్కడే పగలగొట్టాడు. బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసి నీళ్లలో కలిపి ఆ నీటిని ప్రజలచే త్రాగించాడు. అహరోనుని చీవాట్లు పెట్టాడు. మోషే ఆనతిపై కొందరు లేవీయులు వెళ్లి విగ్రహారాధనకు పాల్పడిన వారిని మూడువేల మందిని కత్తులతో నరికివేశారు. మోషే ఆ లేవీయులను మెచ్చుకొన్నాడు. 29. మిర్యాముకి కుష్ట సోకడం - సంఖ్యా 12 మోషే యితియోపీయ స్త్రీని పెండ్లి చేసికొన్నాడు. పైగా అక్క మిర్యాముకి, అన్న అహరోనుకి అతని నాయకత్వం నచ్చలేదు. వాళ్లు మోషే వొక్కడే నాయకుడా మేము మాత్రం కామా అని గొణిగారు. దేవుడు వారిని మందలించాడు. నేను మోషేను నా ప్రజలందరికీ నాయకుణ్ణిగా నియమిం చాను. అతడు నా రూపాన్ని చూచాడు. నా సేవకుణ్ణి ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలు అని మండస్ట్ర తమ్మని ఎదిరించినందుకు శిక్షగా