ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిచ్చాడు. ఈయాజ్ఞలను పాటించడం ద్వారా ప్రజలు ఏక సమాజంగా ఒనగూడి దేవుని ప్రజలయ్యారు. ఆ జనం దేవుని పట్ల తోడి నరులపట్ల ఏలా ప్రవర్తించాలో ఈ యాజ్ఞలు తెలియజేస్తాయి. క్రీస్తు విచ్చేసిందాకా, అనగా 13 వందల యేండ్లపాటు ఈధర్మశాస్త్రం యూదులకు రక్షణ సాధనమైంది. 25. చేదు నీళ్లు - నిర్గ 15,22-25 ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ షూరు అరణ్యాన్ని చేరారు. అక్కడ మూడు నాళ్లపాటు త్రాగడానికి నీరు దొరకలేదు. మారా అనే తావులో నీళ్లు కన్పించాయి గాని అవి చేదు ವಿಟ್ಜಲು. దేవుని ఆజ్ఞపై మోషే ఒక కొయ్యను నీటిలో పడవేయగా అవి తీయనయ్యాయి. జనం దప్పిక తీర ఆ నీళ్లు త్రాగారు. 26. మన్నా పూరేడు పిట్టలు - నిర్గ 16 జనం సీను అరణ్యాన్ని చేరారు. అక్కడ వారికి ఆహారం లభించలేదు. పస్తులుండలేక మోషేమీద తిరగబడ్డారు. ఈజిప్టులో దాస్యంలో వున్నా కడుపు నిండా తిండి దొరికింది. ఈ యరణ్యంలో తినడానికి తిండి లేదు అని సణిగారు. మోషే దేవునికి మొరపెట్టగా ప్రభువు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వారంలో ఆరు రోజులపాటు ప్రతిరోజు ఉదయం మన్నా కురిసేది. జనం దాన్ని ప్రోగుజేసికొని వండుకొని తినేవాళ్లు. ఆరురోజులు సాయంకాలం పూరేడు పిట్టలు వచ్చి వారి శిబిరాల్లో వాలేవి. ప్రజలు వాటిని పట్టుకొని మాంసం వండుకొని భుజించేవాళ్లు. ఏడవనాడు విశ్రాంతి దినం. ఆ దినం మన్నా కురువదు. కనుక ఆరవనాడే రెండు రోజులకు సరిపోయినంత ప్రోగుజేసికొనేవాళ్లు. మన్నా తెల్లని రంగులో ధనియాల ఆకారంలో వుండేది. రుచికి తేనెవలె తీయగా వుండేది. ఎడారి కాలం నలభై యేండ్ల పాటు మన్నా కురుస్తూనే వుంది. 27. రాతినుండి నీళ్లు - నిర్గ 171-7 జనం రెఫీదీము వద్ద విడిది చేశారు. అక్కడ కూడ నీళ్లు దొరకలేదు. వెంటనే ఇక్కడ మేము, మా పిల్లల్లు.ప్రశువులు దప్పికతో చావాలా యేమి I