ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనాన్ని వెళ్లిపోనిచ్చాడు. మోషే బానిసంలో వ్రుగ్గుతున్న ప్రజలను తోడ్కొని కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. 430 ఏండ్ల దాస్యం ముగిసింది. అంతా రెల్ల సముద్రం దగ్గరికి వచ్చారు. యిప్రాయేలు జనం ఇంచుమించు ఆరు లక్షలమంది పురుషులు. ప్రభువు కలిగించిన మేఘస్తంభం ప్రజలను నడిపించింది. అది పగలు నల్లని మబ్బులాగాను, రాత్రి అగ్ని లాగాను కన్పించేది. కాని ఫరో మనసు మార్చుకొని ప్రజలను మళ్లా పట్టుకొని పోవడానికి రథాలతో గుర్రాలతో వచ్చాడు. ముందు సముద్రం, వెనుక శత్రు సైన్యం. ప్రజలు దిక్కుదోచక దేవునికి మొరపెట్టారు. ప్రభువు ఆజ్ఞపై మేఘస్తంభం యిస్రాయేలీయులకు వెలుగునీ ఈజిష్ఠీయులకు చీకటినీ కలిగించింది. మోషే చేతిని చాపగా సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది. రెండువైపుల నీళ్లు అడ్డుగోడల వలె నిల్చిపోయాయి. యావే ప్రజలు పొడినేల మీదిగా నడచినట్లుగా సముద్ర గర్భం గుండ నడచి ఆవలి వొడ్డు చేరుకొన్నారు. ఫరో సైన్యం గూడ సముద్రగర్భంలోకి దిగింది. కాని మోషే మళ్లా చేయి చాపగా ఇరువైపుల వున్న నీళ్లు తిరిగి కలసి పోయాయి. ఫరోసైన్యమంతా నీటిలో మునిగి చచ్చింది. దైవప్రజలు దేవుడు చేసిన మహాద్భుతానికి సంతోషించి యావేను కీర్తించండి. ఆయన గుర్రాలనూ రౌతులనూ సముద్రంలో కూలద్రోశాడు అని పాటపాడారు. 24. కొండమీద ధర్మశాస్రం - నిర్గ 19, 16-20 ప్రజలు ఈజిప్టు నుండి బయలుదేరిన యాబయవ దినాన సీనాయి కొండను చేరుకొన్నారు. మూడవ రోజు మోషే కొండనెక్కగా ప్రభువు దాని మీదికి దిగివచ్చాడు. కొండమీద నల్లని మబ్బు కమ్మింది. ఉరుములు, మెరుపులు, పొగ, అగ్ని కనిపించాయి. కొమ్మ బూర మ్రోగింది. దేవుడు అగ్నిరూపంలో దిగిరాగా కొండ దద్దరిల్లింది. క్రిందవున్న ప్రజలు భయంతో గడగడ వణికారు. మోషే కొండ శిఖరం మీదికి ఎక్కాడు. ప్రభువు ఉరుములాంటి శబ్దంతో అతనితో మాటలాడాడు. ఆ కొండమీదనే ప్రభువు మోషేకు పదియాజ్ఞల రూపంలో ధర్మశాస్తాన్ని దయచేశాడు. ఆయాజ్ఞలను రెండు రాతిపలకల మీద వ్రాసి