ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలుడు రాజుగారి మేడలోనే రాజకుమారుత్తాగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఈజిప్టులోని విద్యలన్నీ నేర్చుకున్నాడు. నలభై యేండ్ల వరకు ఈజిప్టులోనే వుండిపోయాడు. 22. మండుతూవున్న పాదతో దైవదర్శనం - నిర్గ 3 ఒక పర్యాయం మోషే ఒక ఈజిష్ఠీయుణ్ణి చంపగా ఫరో కోపించి అతన్ని ప్రాణాలు తీయబోయాడు. మోషే మిద్యాను ఎడారికి పారిపోయాడు. ఆ దేశపు పూజారియైన రగూవేలు కొమార్తె సిప్పొరాను పెండ్లి చేసికొన్నాడు. రోజూ మామ మందలను తోలుకొని పోయి హోరేబు కొండ దగ్గర మేపుకొని వచ్చేవాడు. ఓదినం అతడు మందలను మేపుతుండగా కొండమీద ఓ పొదకు నిప్పంటుకొంది. అది యెంతసేపు మండినా బుగ్గయిపోలేదు. అది ఆలా యెందుకు బూడిదయి పోలేదో చూద్దామని మోషే పొద దగ్గరికి వెళ్లాడు. దేవుడు అతనితో నేను మీ పితరుల దేవుణ్ణి. ఈజిప్టులో యిస్రాయేలు ప్రజలు ఫరో దాస్యంలో చిక్కుకుని నానా బాధలకు గురై నాకు మొరపెట్టారు. నీవు వారిని ఆ దాస్యం నుండి విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్లాలి సుమా అని చెప్పాడు. మోషే అంతకుముందే ఈజిప్టు నుండి పారిపోయి వచ్చాడు. కనుక ఫరో దగ్గరికి వెళ్లడానికి జంకాడు. కాని ప్రభువు అతనికి అభయమిచ్చి నేను నీకు తోడైయుంటానని చెప్పాడు. తన దివ్యనామాన్ని మోషేకు తెలియజేశాడు. అతడు తన కర్రతో అద్భుత కార్యాలు చేసే శక్తినిచ్చాడు. అతనికి తోడుగా వుండడానికి అహరోనుని గూడ జతపరచాడు. మోషే భార్యా పిల్లలతో ఈజిప్టుకి తిరిగివచ్చాడు. 23. రెల్ల సముద్రం దాటడం - నిర్గ 14 మోషే వేడుకొన్నా ఫరో మొదట ప్రజలను పంపివేయడానికి వొప్పుకోలేదు. దేవుడు మోషే ద్వారా ఈజిప్టు మీదికి పది అరిష్టాలను పంపాడు. ఆ దేశంలో పంటలన్నీ నాశమయ్యాయి. పశువులు చచ్చాయి. రోగాలు ప్రబలాయి. నీళ్లు నెత్తురుగా మారాయి. చీకట్లు అలముకొన్నాయి. పదవ అరిష్టంలో దేశంలోని తొలిచూలు పిల్లలంతా చచ్చారు. సింహాసనం ఎక్కనున్న ఫరో కుమారుడు కూడచ్లన్డిపోయాడు. ఆ రాజు గుండె చెదరి