ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవునిపట్ల భయభక్తులతో జీవించాడు. అతనికి పెద్ద సంతానమూ సిరిసంపదలూ వున్నాయి. దేవునికి అతడంటే యిష్టం. సాతానుకి మాత్రం అతడు గిట్టలేదు. సాతాను యోబు వట్టినే నిన్ను పూజించడం లేదు. నీ సిరిసంపదల కోసం నిన్ను కొలుస్తున్నాడు అని వాదించాడు. దేవుడు సాతానుకి యోబుని పరీక్షించడానికి అనుమతినిచ్చాడు. అతని ప్రాణాలు మాత్రం తీయకూడదు. సాతాను యోబుని నానా విధాల శోధించాడు. అతని ఆస్తిపాస్తులు పోయాయి. కొడుకులూ కూతుళూ చనిపోయారు. పెద్ద వ్యాధిబాధలు వచ్చిపడ్డాయి. ఐనా యోబు దేవునికి విధేయుడయ్యాడే గాని పల్లెత్తుమాట అనలేదు. యోబు భార్యదేవుడు నీకిన్ని కష్టాలు పంపాడు కదా! చనిపోకముందే అతన్ని బాగా శపించి చావు అని సలహా యిచ్చింది. కాని యోబు దేవుడు ఇంతకాలం లాభాలు ఇస్తే బాగా అనుభవించాం. ఇప్పుడు కీడులు పంపితే అతన్ని తిడతామా అన్నాడు. ఎన్ని దురదృష్టాలు వచ్చినా అతడు దేవుణ్ణి దూషించలేదు. యోబు భక్తికి మెచ్చి దేవుడు అతడు పోగొట్టుకొన్న దానికంటె అధికంగా మళ్లా సిరిసంపదలూ సంతానమూ దయచేశాడు. మహా భక్తుడైన యోబు నేటికీ మనకు ఆదర్శంగా వుంటాడు. 21. నైలునదిలో మోషే శిశువు - నిర్గ 1 యాకోబు కాలంలో ఈజిప్టుకి వలసవెళ్లిన యిస్రాయేలు ప్రజలు ఆదేశంలో తామరతంపరగా వృద్ధి చెందారు. ఆ దేశాన్ని యేలే ఫరోరాజు వారిని చూచి భయపడ్డాడు. వారిని బానిసలుగా చేసి వెట్టిచాకిరి చేయించు కొన్నాడు. ఆ ప్రజల జనసంఖ్యను తగ్గించడానికి వారికి పుట్టిన మగబిడ్డలం దరినీ నైలునదిలో త్రోయించాడు. ఆ పరిస్థితుల్లో యోకెబెదు అనే యిస్రాయేలు స్త్రీ మోషే అనే మగబిడ్డను కంది. ఆ శిశువు ప్రాణాలు రక్షింపగోరి వాణ్ణి తారుపూసిన పెట్టెలో పెట్టి నైలునదిలోని జమ్మలో వదలి పెట్టింది. ఫరో కూతురు నదిలో జలకాలు ఆడ్డానికి వచ్చి పెట్టె తెరచి చూచింది. శిశువు మీద జాలి కలిగి వాణ్ణి దత్తు తీసికొంది. రాజకుమారి శిశువుకి ఒక డాదిని నియమించాలనుకొంది. శిశువుని కనిపెట్టడానికి ప్రక్కనే వేచివున్న మోషే సోదరి సొర్తిత్ర తల్లినే దాదిగా పిల్చుకొని వచ్చింది.