ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడేండ్లపాటు బాగా పంటలు పండి ధాన్యం నిండిపోతుంది. అటు తర్వాత ఏడు బక్కచిక్కిన ఆవులూ ఏడు పీల కంకులకు సూచనంగా దేశంలో ఏడేండ్లపాటు గొప్ప కరువు వస్తుంది. కనుక రాజు ఒక తెలివి కల అధికారిని నియమించి బాగా పంటలు పండిన ఏడేండ్ల కాలంలో ధాన్యాన్ని నిల్వజేయిం చాలి. దాన్ని తర్వాత వచ్చే ఏడేండ్ల కరువు కాలంలో వాడుకోవాలి. రాజు యోసేఫు తెలియజేసిన కలల భావాన్ని విని సంతోషించాడు. అతన్నే ఈజిప్టుకి సర్వాధికారిగా నియమించాడు. యోసేఫు ఏడేండ్ల పంట కాలంలో ధాన్యాన్ని ప్రోగుచేసి నగరాల్లో నిల్వ జేయించాడు. కరువు కాలంలో దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. పొరుగు దేశాల ప్రజలు కూడ ఈజిప్టుకి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కనుక ఆ దేశానికి మంచిపేరు వచ్చింది. 19. యోసేపు సోదరులను క్షమించడం - ఆది 50, 18-26 కనాను దేశం నుండి అన్నలు రెడుసార్లు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఈజిప్టులోని యోసేఫు దగ్గరికి వచ్చారు. రెండవసారి యోసేఫు తన్ను తాను సోదరులకు తెలియజేసికొన్నాడు. సోదరులూ, యూకోబూ కూడ యోసేపు బ్రతికి వున్నందుకూ, ఈజిప్టుకి అధికారి ఐనందుకూ ఆశ్చర్యపోయారు. తర్వాత యాకోబు కుటుంబ మంతా ఈజిప్టుకి వలస వచ్చి అక్కడే స్థిరపడింది. యాకోబు చనిపోయాక సోదరులు యోసేపు తమ మీద పగతీర్చుకొంటాడేమోనని భయపడ్డారు. కనుక అతని దగ్గరికి వచ్చి మేము నీ దాసులం అని చాగిలపడ్డారు? యోసేఫు మీరైతే నాకు కీడు తలపెట్టారు. కాని దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. మన కుటుంబంతోపాటు ఇంతమంది ప్రాణాలను కాపాడ్డానికే దేవుడు ముందుగా నన్నిక్కడికి పంపాడు. నేను మిమ్మ తప్పక ఆదరిస్తాను అని చెప్పాడు. అతని మంచితనానికి సోదరులు విస్తుపోయారు. యోసేఫు ఈజిప్టులో 110 యేండ్లు బ్రతికి చనిపోయాడు. 20. యోబు భక్తి - యోబు 1-2 యోబు అబ్రాహాముతోపాటు కాల్జియా దేశంలో వసించాడనీ, అతనికి సమకాలికుడనీ కొందరి తలంపు. అతడు పాపాన్ని విడనాడి