ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ෂඨි ඡා బట్టనే ఆనవాలుగా చూపి యోసేఫు తనను చెరచబోయాడనీ, తాను కేకలు వేయగా పారిపోయాడనీ భర్తకు పిర్యాదు చేసింది. పోతీఫరు ఆమె మాటలు నమ్మి యోసేఫుని చెరలో త్రోయించాడు. అతడు రెండేండ్ల పాటు ఆ చెరలోనే వున్నాడు. 17. సేవకుల కలలు - ఆది 40 యోసేఫు వున్న చెరలోనే రాజు వంటవాడు, పానీయవాహకుడు కూడ వున్నారు. వాళ్లిద్దరూ కలలు కనగా యోసేఫు వాటికి అర్థం చెప్పాడు. పానీయవాహకుడు మూడు రెమ్మలు కల ద్రాక్ష తీగనుండి పండ్లుకోసి రసం పిండి రాజుకు అందించినట్లుగా కలగన్నాడు. యోసేఫు ఈ కల భావం ఇది. మూడు రోజుల్లోనే రాజు నిన్ను మన్నించి మళ్లా పూర్వపు పనిలో నియమిస్తాడు. నీవు చెరనుండి తప్పించుకొన్నప్పడు నన్ను జ్ఞాపకం బెట్టుకో అని చెప్పాడు. వంటలవాడు నేను పిండివంటల గంపలు మూడు రాజదగ్గరికి మోసుకుని పోతున్నాను. కాని పై గంపలోని వాటిని పక్షులు తింటున్నాయి. ఇది నా కల అని చెప్పాడు. యోసేఫు ఈ కల భావం ఇది. మూడు రోజుల తర్వాత రాజు నిన్ను చంపించి చెట్టుకి వ్రేలాడదీయిస్తాడు. అప్పుడు ఆకాశ పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి అని చెప్పాడు. తర్వాత యోసేఫు చెప్పినట్లుగానే జరిగింది. ఐతే పానీయ వాహకుడు విడుదల పొందినా యోసేఫని మర్చిపోయాడు. 18. ఫరో కలలు - ఆది 41 ఒకరాత్రి ఈజిప్టుని పరిపాలించే ఫరోరాజుకి రెండు కలలు వచ్చాయి. మొదటి కలలో బక్కచిక్కిన ఏడావులు బలసిన ఏడావులను మింగివేశాయి. రెండవ కలలో ఏడు పీల కంకులు గింజలు పట్టిన ఏడు గట్టి కంకులను మింగివేశాయి. రాజు ఈ కలల భావం ఏమిటని తన సలహాదారులను అడిగాడు గాని వాళ్లు జవాబు చెప్పలేక పోయారు. కలల అర్థం చెప్పడానికి యోసేఫు వంతు వచ్చింది. అతడు రెండు కలలకు ఒకే అర్ధం చెప్పాడు. ఏడు బలసిన ఆవులకూ, ఏడు గట్టికంకులకూ సూచనంగా దేశంలో