ఈ పుట ఆమోదించబడ్డది

82

ప్రసార ప్రముఖులు.

క్యూటివ్‌గా 1963 జనవరిలో విశాఖపట్టణం, మదరాసు కేంద్రాలలో పని చేశారు. 1981 నుండి ప్రోగ్రాం ఎగ్జికూటివ్‌గా వివిధ కేంద్రాలలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా, గుల్బర్గా కేంద్రంలో పనిచేసి 1995 ఫిబ్రవరిలో రిటైరయ్యారు. శంకర నారాయణ చక్కటి చిత్రకారులు, సౌమ్యులు.

వి. చంద్రమౌళి 1931 ఆగస్టు 28న జన్మించారు. 1964లో ట్రాంస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు, డైరక్టరుగా వివిధ కేంద్రాలలో పని చేశారు. మద్రాసు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పాండిచ్చేరి స్టేషన్ డైరక్టర్‌గా 1989లో రిటైరయ్యారు.


మదరాసు కేంద్రంలో పని చేసిన మరో అధికారి కె. ఆంజనేయులు. వీరు 1934 జూన్ 3న జన్మించారు. 1954లో ఆకాశవాణిలో చేరి 1986లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా నాగర్‌కోయిల్ లోకల్ కేంద్రం బదిలీ అయ్యారు. 1992లో ఆంజనేయులు రిటైరయ్యారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు నుండి తెలుగు ప్రసారాల ప్రయోక్తగా ఆంజనేయులు సుపరిచితులు. వింజమూరి లక్ష్మి, కె. కలి వేలు, రామమోహనరావు, విజయసారధి, పద్మజా నిర్మల ఇలా ఎందరో కార్యక్రమ నిర్వహకులు తెలుగు కార్యక్రమాలు రూపొందించారు.

శ్రీమతి దుర్గాభాస్కర్ 1945 ఫిబ్రవరి నాలుగున ఏలూరులో సుప్రసిద్ధ గాయకులు ఈదర నాగరాజుగారికి జన్మించారు. దుర్గారాణిగా 1963 అక్టోబరులో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాంస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు కేంద్రంలో పని చేశారు. 1984లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా అహమ్మదాబాద్ వాణిజ్య ప్రసార విభాగంలో పని చేశారు. అక్కడ నుండి విశాఖపట్టణం, మదరాసు కేంద్రాలలో పని చేశారు. 1993 ఏప్రిల్ నుండి విజయవాడ కేంద్రం తొలి మహిళా డైరక్టరుగా పనిచేశారు. 1995 మార్చిలో మదరాసు కేంద్రం డిప్యూటీ డైరక్టరుగా బదిలీ అయ్యారు. లలిత సంగీతంలో దుర్గాభాస్కర్ చక్కటి గాయని.

పాత తరానికి చెందిన వారిలో జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి దంపతులు తెలుగు ప్రసారాల బావుటాను విను వీధుల్లో ఎగుర వేశారు. సినీ ప్రముఖులు ఎందరో యిక్కడి