ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

47

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1956లో నాటక ప్రయోక్తగా ప్రవేశం చేసి 12 సంవత్సరాల పాటు ఎన్నో నాటకాలు ప్రసారం చేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి ఊపిరిపోసింది బందా. కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యత్వాలు లభించాయి. అభినవకృష్ణ, నటశేఖర బిరుదులతో సత్కరించారు. ఉత్తమనటుడుగా 1963లో రాష్ట్రపతి అవార్డు పొందారు. రేడియో నాటికలు సంపుటిగా ప్రచురించారు. కూచిపూడి నృత్యంపై వీరి రచన ప్రామాణికం

1968 డిసెంబరు 3న నాటకరంగంలో ధృవతార రాలిపోయింది. ఇప్పటికీ కూచిపూడిలో బందా వర్థంతి ఏటా జరుగుతుంది. కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్ర నిర్మాణానికి ఆయన కృషి అపారం.

వీరి తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవలసిన వ్యక్తి ఆమంచర్ల గోపాలరావుగారు వీరు నాటక విభాగ ప్రయోక్తగా విజయవాడలో పనిచేసి పదవీ విరమణ చేశారు. చాలాకాలం మదరాసులో కూడా పనిచేశారు. {{ {{}}యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ) 1913 }} శ్రీవాత్సవగా ప్రసిద్ధి చెందిన యండమూరి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో 1913 మే 21న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం గావించిన సత్యనారాయణ ఆకాశవాణిలో విజయవాడ, మదరాసు కేంద్రాలలో కార్యక్రమ నిర్వహకులుగా చాలాకాలం పనిచేశారు. ఆపైన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా ఢిల్లీ బదలీ అయి వెళ్ళారు.

శ్రీవాత్సవ విమర్శకులుగా పేరు తెచ్చుకొన్నారు. భారతి, జయంతి, ఆంధ్ర పత్రిక తదితర పత్రికలలో సాహిత్య సింహావలోకనాలు ఏటా ప్రచురించేవారు. ఉష:కిరణాలు, శారదాధ్వజం గ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1966లో బహుమతి ప్రకటించింది. తంజావూరు నాయకరాజుల సాహిత్య భాషను శారదా ధ్వజంలో వివరించారు. ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ చారిత్రక స్థితిగతులు ఆయన ఆ గ్రంథంలో విశ్లేషించారు. జలతారు జాబిల్లి పేరుతో బాలలకు ఒక పుస్తకం వ్రాశారు. వయోజన విద్యావ్యాప్తిలో భాగంగా టెలివిజన్ కథ రంగురంగుల పూలు అనే గ్రంథాలు వ్రాశారు. వీరి రచనలకు కేంద్ర ప్రభుత్వ