ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ప్రసార ప్రముఖులు.

తాకిడికి గురిఅయినప్పుడు భారతీయ వాతావరణ కేంద్రం వారు హెచ్చరికలు అందించేందుకు అనువుగా యంత్ర పరికరాలను 1986లో అమర్చారు. అవి తుఫాను హెచ్చరికలు అందిస్తాయి. తుఫాను సమయంలో 24 గంటలపాటు - ఆకాశవాణి ప్రసారాలు జరుపుతుంది.

1976-96 రెండు దశాబ్దాల కాలంలో స్టేషన్ డైరక్టర్లుగా వ్యవహరించిన సర్వశ్రీ పి. శ్రీనివాసన్, సి. ఆర్. రెడ్డి, అయూబ్, కులకర్ణి దుర్గా భాస్కర్, డా. ఆర్. అనంత పద్మనాభరావు, ఆకాశవాణి ప్రసారాలు బహుళనా మోదం పొందడానికి కృషిచేశారు.

శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు (1928-1989)

ఆకాశవాణి శ్రోతలకు, సంగీత రసికులకూ విస్తృత పరిచయమున్న మహా విద్వాంసులు శ్రీ వోలేటి. సంగీతాన్ని భక్తి శ్రద్ధలతో, శుద్ధమైన మనస్సుతో ఆసక్తితో పాడిన అరుదైన విద్వాంసుడు శ్రీవోలేటి. వీరి నేతృత్వంలో ప్రసారమైన ఎన్నో సంగీత రూపకాలు, యక్షగానాలు, విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తి నార్జించి పెట్టాయి.

వోలేటి గారి జననం 1918 ఆగస్టు 27. తల్లిదండ్రులు నరసింహారావు, అచ్చికామలు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం స్వగ్రామం. గుడివాడలో చతుర్వేదుల అచ్యుత రామశాస్త్రిగారి వద్ద సుమారు 20 వర్ణాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత 1935 సం||లో కాకినాడకు మకాం మారటంతో వీరి సంగీతాభ్యాసం సుగమమైంది. కాకినాడలో శ్రీరామగాన సమాజంలో, ఆరోజుల్లో ఉచిత భోజన వసతి కల్పిస్తూ, సంగీతం నేర్పేవారు. ఆ సంస్థను ఉదారంగా నడిపిన మహనీయుడు కీ||శే|| మునుగంటి వేంకట్రావు పంతులుగారు. పది సంవత్సరాల పాటు పంతులుగారి వద్ద సంగీతాభ్యాసం చేశారు. శ్రీవోలేటి.

1950 సంవత్సరంలో డా||శ్రీపాద పినాకపాణి గారి పరిచయంతో వోలేటిగారు 3, 4 సం||లు సంగీతంలోని మెళుకువల్ని, ముఖ్యంగా తంజావూర్ బాణీని పాణిగారి దగ్గర గ్రహించారు.

1956 సం|| నుంచి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా వుంటూ సంగీతశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. వోలేటిగారు మనస్సు పెట్టి