ఈ పుట ఆమోదించబడ్డది

న్నారు. ఆచంట జానకీరాం నలుగురి నాటకాలు ఏర్చి కూర్చిన అనార్కలి నాటకం రేడియో స్క్రిప్టురిహార్సల్సు జరుగుతున్నాయి. కృష్ణశాస్త్రి మేనకోడళ్లు ఏ కారణం చేతనో రాకపోవడంవల్ల అనార్కలి నాటకం కోసం ఆయన వ్రాసిన పాటలు నాకు వచ్చి వుండటంతో పన్యాలరంగనాధరావు భార్య సరస్వతికి, లీలకు నేర్పాను. వసుమర్తి విశ్వేశ్వరమ్మ అనార్కలి తనకంటె చదవడానికి తన చెల్లెలు భానుమతి యోగ్యంగా వుంటుందంటే ఆమెను తీసుకొచ్చారు.

ఈ నాటకం నేను యూనివర్శిటీ కెళ్ళి జూన్ 1 వ హాస్టల్ లో విన్నాను. ఇది రేడియోలో చేరడానికి రెండేళ్ళ ముందు, తర్వాత జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

అప్పుడు రేడియో తెలుగు త్రిమూర్తులు అనేవారు. ఆచంట జానకీరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణ మూర్తి, ఇందులో ఆచంట మంచి కల్పనా శక్తి, క్రియాశీలత కలిగి బ్రహ్మ కింద పోల్చేవారు. పరిపాలనా దక్షుడైన మూర్తిగారు విష్ణువు. విమర్శ విహార పట్టభద్రుడైన వీరభద్రుడు శివుడు. నాకు ఈ ముగ్గురు దగ్గర పనిచేయడం విశేషం. ఒక్కొక్కరి ప్లానింగు ఒక్కోరకం. వాళ్ళ మనసులెరిగి పనిచేయడం నా విజయానికి దోవ తీసేది. వీళ్లు క్రమంగా మదరాసు కేంద్రం వదలి ఇతర కేంద్రాలకు ప్రమోషన్, బదలీల మీద వెళ్ళేవారు, వచ్చేవారు.

1948 డిసెంబరు 1 న విజయవాడ కేంద్రానికి N. S. రామచంద్రన్, అయ్యగారి వీరభద్రరావుల నేతృత్వంలో ప్రారంభం జరిగింది. బాలగురుమూర్తి, యండమూరి సత్యనారాయణ సీనియర్ PEXలు. అప్పుడు సాయంత్రం 5-30 గం॥కు ప్రసారం మొదలయ్యేది. ఒకవారం నా సహచర మిత్రులు నేను P. భానుమతి కలిసి పాడిన తెలుగుతల్లి పాటతో ప్రసారాలు ప్రసారం చేసేవారు. ఇది నేను ప్రత్యేకంగా యూనివర్శిటీలో కట్టమంచి రామలింగారెడ్డి కోరికపై వ్రాసిన పాట. 'పసిడిమెరుంగుల తళతళలు' అని పాట మొదలు.