ఈ పుట ఆమోదించబడ్డది

20

ప్రసార ప్రముఖులు.

హైదరాబాదులో బాలానంద సంఘం కార్యకలాపాలు కొనసాగినంత కాలం రాఘవరావు దంపతులు చిరంజీవులు. సినీ రంగంలోని కాంచన, షావుకారు జానకి, కృష్ణకుమారి, నేపథ్య గాయని సుశీల, వింజమూరి లక్ష్మి, వైణికులు చిట్టిబాబు బాలానంద సంఘ సభ్యులు.

1948లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనపుడు ' పాలవెల్లి ' బాలల కార్యక్రమం ఈ బాలానంద సంఘ సభ్యులు ప్రథమంగా ప్రసారం చేశారు. రేడియో అక్కయ్య స్మారకార్థం ' కామేశ్వరి స్మారక శిశులాలన కేంద్రం' రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. మురికివాడలలో తల్లులు మధ్యతరగతి తల్లులు ఈ కేంద్రాన్ని వినియోగించుకొంటున్నారు. ఆంధ్ర బాలానంద సంఘ ట్రస్టు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ ఇంద్రజాలికులు శ్రీ బి. వి. పట్టాభిరాం ఏటా నిర్వహిస్తున్నారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) :

పిఠాపురాస్థాన కవులైన తండ్రిగారి సాహితీ వారసత్వం కృష్ణశాస్త్రికి లభించింది. వీరి స్వస్థలం పిఠాపురానికి సమీపంలోని చంద్రంపాళెం. 1897 నవంబరు 15 న శాస్త్రి జన్మించారు. వీరు పట్టభద్రులు. కాకినాడ P. R. కళాశాలలో 1931-41 మధ్య ట్యూటర్ గా పనిచేశారు. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో వీరు తెలుగు ప్రసంగాలశాఖ ప్రొడ్యూసర్ గా 1957-64 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం వీరిని కళా ప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, పల్లకి - వీరి ఖండకావ్య సంపుటాలు. అప్పుడు పుట్టి వుంటే, పుష్పలావికలు, బహుకాల దర్శనం - వచన రచనా సంపుటాలు. వెండి తెర పాటలు మేఘమాలగా ప్రచురితమయ్యాయి. వందలాది చలనచిత్ర గీతాలను రచించారు. ప్రేక్షకుల ఆదరణ లభించింది.

నవ్య సాహిత్యోద్యమానికి ' దేవులపల్లి ' ఆద్యులు. ఆత్మాశ్రయ కవిత్వం వచ్చిన తొలి రోజుల్లో తన దుఃఖాన్ని సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. అనేక రేడియో నాటికలు, ప్రసంగాలు శ్రోతల మన్నన లందుకొన్నాయి. జీవిత చరమ దశలో ' గొంతు క్యాన్సర్ ' వచ్చింది. మదరాసులో చివరి రోజులు గడిపారు. వీరి కుమారుడు ' బుజ్జాయి '. వీరి మేనకోడళ్లు వింజమూరి సీతాదేవి,