ఈ పుట ఆమోదించబడ్డది

16

ప్రసార ప్రముఖులు.

1920వ సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేసారు. దాదాపు నాలుగు దశాబ్దాలు స్త్రీ పాత్రలు ధరించారు.

సత్యభామ శృంగార రసాధి దేవత. స్వాభిమానానికి ప్రతీక. ఆ పాత్రను సహజంగా పోషించడంలో స్థానానికి విశిష్ట స్థానం. అలానే సారంగధర నాటకంలో మిత్రాంగి, విప్రనారాయణలో దేవదేవి, కన్యాశుల్కంలోమధురవాణి, హరిశ్చంద్రలో చంద్రమతి, నలదమయంతిలో దమయంతి పాత్రలను విశేష ప్రతిభతో ప్రదర్శించేవారు. నటన ఆయనొక తపస్సు. రోషనార, చింతామణి పాత్రలు విశేషం.

వేషధారణలో, వస్త్రధారణలో ఆయనది ప్రత్యేక స్థానం. చీరకట్టులో అయన చూపే నైపుణ్యం స్త్రీలకే ఆశ్చర్యం గొలిపేది. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో పాత్ర పోషణలో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. రాష్ట్రపతి డా॥ రాధాకృష్ణన్, ప్రముఖ రచయత హరీంద్రనాథ చటోపాధ్యాయ నరసింహారావును ప్రశంసించారు. భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ సత్కారం చేసింది. 1971 ఫిబ్రవరి 21న స్థానం కాలధర్మం చేసారు

1956 నుండి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగ ప్రయోక్తగా స్థానంవారు చక్కటి నాటకాలు ప్రసారం చేసారు బళ్ళారి రాఘవ సరసన నటించారు. నటశేఖర, ఆంధ్ర గంధర్వ, నాటకావతఁస భిరుదులు పొందారు. తెనాలిలో రామ విలాస సభ స్థాపించి దేశవిదేశాల్లో ప్రదర్శన లిచ్చారు.

మునిమాణిక్యం నరసింహారావు (1898-1973)

కాంతం కథలతో ఆంధ్ర పాఠకులకు చిరపరచితులైన మునిమాణిఖ్యం నరసింహారావు 1898 మార్చి 15న గుంటూరుజిల్లా సంగంజాగర్లమూడిలో జన్మించారు. పూర్వాచార సనాతన కుటుంబం వారిది. తండ్రి ఉపాధ్యాయులు.

తెనాలి, విజయనగరం, రాజమండ్రిలో చదువుకొని బి.ఏ , ఎల్ .టి . పూర్తి చేసారు. ఆ తరువాత గుంటూరు, భీమవరం, బందరు కళాశాలల్లో 30 ఏళ్ళు పని చేసారు. ఆదర్శ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకొన్నారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో విద్యా ప్రసారాలు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేసారు. ఆంధ్ర సారస్వత పరిషత్, తెలుగు పండిత శిక్షణా పాఠశాల హెడ్ మాస్టర్ గా హైదరాబాదులో