ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

7

క్టర్ ఆఫ్ ప్రోగ్రాం (పెరసనల్‌గా) పనిచేశారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన ఈ శాఖను సర్వసమర్థంగా నిర్వహించారు. వీరు 1993 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి విజయవాడ, హైదరాబాదు, గుల్బర్గా కేంద్రాలలో వివిధ హోదాలలో పనిచేశారు. హిందీలో చక్కటి ప్రవేశమున్న రఘురాం 14. 2. 35 న అనంతపురం జిల్లాలో జన్మించారు. సున్నిత హృదయులైన రఘురాం చక్కటి కార్యక్రమాల రూపకల్పన శిల్పి. 1982 లో స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొందారు.

డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మరో ప్రముఖులు బి. ఆర్. చలపతిరావు. ఆకాశవాణిలో చేరడానికి ముందు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన చలపతిరావు ఆడియన్స్ రెసెర్చి ఆఫీసర్ గా 1-4-69 న చేరారు. 1985 డిసెంబరులో యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్ గా సెలక్ట్ అయి మంగుళురు కేంద్ర డైరక్టరుగా చేరారు. 1987 ఏప్రిల్ లో డైరక్టరేట్ లో వాణిజ్య విభాగం డైరక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో దాదాపు 8 సంవత్సరములు జయప్రదంగా పనిచేసి 1994 జనవరిలో పదవీ విరమణ చేశారు. రచయితగా, వక్తగా, అధికారిగా చలపతిరావు సమర్ధులు. చలపతిరావు విశాఖపట్టణంలో 12-12-36 న జన్మించారు. చలపతిరావు ఢిల్లీలో స్థిరపడ్డారు. 1994 నుండి 96 వరకు సలహాదారుగా వ్యవహరించారు.

డా. ప్రపంచం సీతారాం ప్రముఖ వేణుగానలోలురు. చిన్నతనంలోనే సంగీత రసజ్ఞులనలరించారు. సీతారాం విజయవాడలో 21.9.42 లో జన్మించారు. ఆకాశవాణిలో 1980 లో చేరడానికి ముందు ఢిల్లీ లోని అశోకా హోటల్లో వేణుగాన విద్వాంసులుగా పనిచేశారు. యు.పి.ఎస్.సి. ద్వారా 1976 లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్ట్ అయి మదరాసులో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా 11.2.85 నుండి విజయవాడలో పనిచేశారు. డైరక్టరేట్ లో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా నాలుగేళ్లు పనిచేశారు. 1993 లో స్వచ్చంద పదవీ విరమణానంతరం తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్ గా చేరారు. సంగీతంలో సీతారాం డాక్టరేట్ పొందారు. విద్వాంసులుగా సీతారాం లబ్ధ ప్రతిష్ఠులు

డైరక్టరేట్ లో సంగీత విభాగంలొ చీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్టులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు.