పుట:Prasarapramukulu022372mbp.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

97

అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీ, లక్నో కేంద్రాలలో పనిచేసి డైరక్టర్ జనరల్ కార్యాలయంలో కంట్రోలర్ గా పనిచేస్తున్నారు.

విమలా మిట్టల్ మరొక ప్రముఖురాలు. ఈమె 1940 మార్చి 25న జన్మించారు. రాష్ట్రేతరులను వివాహమాడారు. మిట్టల్ స్టేషన్ యింజనీర్ గా ఆకాశవాణి, దూరదర్శన్‌లో పనిచేస్తున్నారు. 1967 డిసెంబరులో ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి అసిస్టెంట్ డైరక్టర్, కంట్రోలర్ గా పనిచేశారు. ప్రవాసాంధ్రులలో ఈమె ప్రముఖురాలు.