ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

ప్రపదనపారిజాతమను నీగ్రన్థ మస్మదాస్థాన పురోహితులగు శ్రీ|| కొటికెలపూడి కోదండరామయ్యగారిచే రచియింపఁబడి -పితామహులగు రాజా శ్రీ శ్వేతాచలపతి రంగారావు బహదరు గారి కంకితము చేయఁబడినది.

ఈగ్రన్థము విశిష్టాద్వైత సిద్ధాన్తమునకుఁ బ్రధానములగు యమన్త్ర తిరుమన్త్రార్థములను భక్తిప్రపత్తుల స్వరూపమును నింక ఆవశ్యకములగు మతవిషయములను మఱి కొన్నిటిని బోధించునది అగుటవలనను, దైవభక్తిని బ్రహ్లాదున కీడని పొగడ్తఁగన్న మాపితామహుల కంకితము చేయఁబడినదియగుటవలనను, దీనిని ముద్రింపించి ప్రకటించుట యావశ్యకమగుటంజేసి యస్మదాస్థాన విద్వాంసులచేఁ తగురీతిని బరిశీలింపించి ముద్రితము చేయింపఁబడియె.

పూర్వ మీగ్రన్థమున వ్రాయఁబడిన వంశపురుషచరిత్రము తక్కిన గ్రన్థములతోఁ బాటుగ సరిగ నుండమిచే నిటీవల మాచేఁబ్రకటింపఁబడిన బొబ్బిలిసంస్థాన చరిత్రము ననుసరించి సంస్కరింపించి వ్రాయింపఁ బడియె.

బొబ్బిలి.

1906 సంవత్సరము.

వేం. శ్వే. రం.