ఈ పుట ఆమోదించబడ్డది

జీవించియున్నదని అనుభవించుము. జీవితమనెడి మహాసముద్రము నిన్ను, తనలోనికి, నెమ్మదిగా గొంపోవుచున్నదని అనుభవించుము. ఆ పిదప కన్నులు తెరువుము. అప్పుడు నీకు గొప్ప మనశ్శాంతి, బలము, పుష్టివచ్చును. దీనిని అభ్యసించి అనుభవించుము.

ప్రాణాయామావశ్యకత, లాభములు

"అనేక జన్మములనుండి కలిగిన ఈ మాయాప్రాపంచిక వాసనలు అనేకమారులుగ చాలా కాలమువరకు యోగసాధనచేయనిదే నశింపవు"

(ముక్తి కోపనిషత్తు)

"మోక్షము నివ్వగల జ్ఞానము యోగసాధన చేయకుండ ఎటుల లభించును? అంతేకాదు. జ్ఞానోదయముకానిదే యోగము కూడ మోక్షము నివ్వజాలదు. కావున ఇంద్రియములను వశపరుచుకొనిన పిదప, సాధకుడు యోగము జ్ఞానము రెండింటిని గురించిన్నీ తీవ్రమగు సాధనచేయవలెను."

(యోగతత్త్వోపనిషత్తు.)

"తత:క్షీయతే ప్రకాశావరణం -"

ఆ పైన వెలుగుకు గల ఆవరణ పోవును.

(యోగసూత్ర 2-52)

తమస్సు, రజస్సు అనునవి రెండునూ అడ్డంకులు. ఇవి రెండూ ప్రాణాయామమువల్ల నశింపగలవు. ఈ రెండింటినీ నాశనమొనర్చినపిదపనే ఆత్మయొక్క నిజమైన ప్రకృతి తెలియగలదు. "చిత్త" మనునది సాత్విక పదార్థములచే చేయబడినదై వున్నప్పటికికూడ, అది రజస్తమములను పొరలచె మూసివేయ