ఈ పుట ఆమోదించబడ్డది

నుండి పోయి రోగియొక్క శరీరములో ప్రవేశించుచున్నదని కూడ భావించుము. ఈ ప్రాణశక్తి రేడియోవలె ప్రపంచమునందలి ఏభాగమునకైన పోగలదు. నీవు కోల్పోయిన ప్రాణశక్తి కుంభకముచేయుటచే తిరిగి లభించును. చాలకాలము, దీర్ఘముగను, శ్రద్ధగను అభ్యసించిన మీదట యీపద్ధతి ప్రకారము చేయుట సిద్ధించును.

విశ్రాంతి

శరీరమును, స్నాయువులను సడలించి వుంచుటవలన శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. ఇందుచే స్నాయువుల ఈడ్పుతగ్గును. ఈ రహస్యము తెలిసిన వారు తమశక్తిని వ్యర్ధము చేసికొనరు. ధ్యానమును కూడ చక్కగా చేయ గలుగుదురు. కొద్ది దీర్ఘ శ్వాసలను తీసికొని శవాసనములో వలె వెల్లకిల పడుకొనుము. పాదములనుండి తలవరకు శరీరమునంతను సడలించి వుంచుము. ఆ తరువాత ఒకప్రక్కకు ఒత్తిగిల్లి పడుకొని స్నాయువుల నన్నింటిని సడలించి వుంచుము. స్నాయువులకు ఏవిధమగు శ్రమయుకలుగనివ్వరాదు. మరల రెండవ వైపుకు ఒత్తిగిల్లి స్నాయువుల నన్నిటిని సడలించుము. సాధారణముగ గాడనిద్రాసమయమున యీ రీతిని అందరూ చేసెదరు. ఒక్కొక్క స్నాయువుకు విశ్రాంతి నిచ్చుటకు ఒక్కొక్క రకపు అభ్యాసము గలదు. తల, భుజములు, మోచేతులు, ముంజేతులు, మణికట్టు, తొడలు, కాళ్ళు, చీలమండలు, కాలి బొటన వ్రేళ్ళు, మోకాళ్ళు మొదలగు ప్రతిభాగమునకు విశ్రాంతి నిమ్ము. వీనిని యోగులు బాగా ఎరుగుదురు. ప్రతి అభ్యాసమును చేయునప్పుడు, ఆ భాగము తన బాధలను పోగొట్టు