ఈ పుట ఆమోదించబడ్డది

నంతను కోల్పోదునేమో యని యెన్నడును భయపడకుము. దీనిని ఎంత అధికముగా వినియోగించుచుందునో, అంత అధికముగా జగత్ప్రాణము (హిరణ్యగర్భుడు) నుండి నీకు లభించును.

ఇది ప్రకృతి నియమము. లోభిని కాబోకుము. కీళ్ళవాతముచే ఎవడైన బాధపడుచున్నచో, వాని కాళ్ళను మెల్లగా పిసుకుము. ఆవిధముగ పిసుకు (చమురుట) నప్పుడు కుంభకము చేసి, మానసికముగ నీ యందలి ప్రాణశక్తిని నీ చేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావించుము. లేనిచో జగత్ప్రాణమునుండి ప్రాణశక్తిని గైకొని, నీచేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావింపుము. రోగి వెంటనే బాధ తగ్గి బలము, ఉష్ణము వచ్చినటుల తలచసాగును. తలనొప్పి మొదలగువాటిని ఈ రీతిగాచేయు ఆకర్షణశక్తి స్పర్శముచే నివారించగలవు. యకృత్తు, ప్లీహ, పొట్ట లేక శరీరమందలి తదితరభాగమును దేనినైన చమురునపుడు, జీవాణువులను ఈ రీతిని ఆజ్ఞాపించును:- "ఒ జీవాణువులారా! మీ మీ ధర్మములను చక్కగా చేయుడు. మిమ్ములను ఆ విధముగా చేయ వలసినదిగా నేను ఆజ్ఞాపించుచున్నాను. అటుల ఆజ్ఞాపించుటచే అవి నీ యిచ్ఛానుసారము చేసితీరును. నీయందలి ప్రాణశక్తిని యితరులకు పంపునప్పుడు మానసికముగ 'ఓం' జపము చేయుము. ఈరీతిని కొందరకు చేసినపిదప, నీకు తగిన యోగ్యతలభించును. తేలుకాటు పొందినవారి కాళ్ళను చమురుచూ క్రిందికి ఆ విషమును దింపవచ్చును.

ప్రాణాయామమును సరిగా అభ్యసించుటవల్ల ధారణా శక్తి, మంచి ఆరోగ్యము, దృడమైన శరీరము లభించగలవు. నీ శరీరమందలి అనారోగ్య భాగములకు ప్రాణశక్తిని పంపి