ఈ పుట ఆమోదించబడ్డది

యామము అయినపిదప 12 'ఓం'లను జపించునంతవరకు మామూలుగా గాలినిపీల్చి విడచుచుండుము. అడుగుకు ఒక్కొక్క 'ఓం; చొప్పునలెక్క పెట్టుట కష్టముగా తోచుచో, ఈ నియమమును పాటించుట మానుము.

'కపాలభాతి'ని కూడ నడచుచూ చేయవచ్చును. పనులతో తీరిక వుండని మనుష్యులు పై ప్రాణాయామమును ఉదయము సాయంత్రములందు షికారుకు వెళ్ళునప్పుడు చేయ వచ్చును. దీనినే ఒకే రాతితో రెండు పక్షులను కొట్టుట అందురు. పరిశుద్ధమగు గాలి వచ్చెడి బహిరంగ ప్రదేశములో నడచుచూ ప్రాణాయామము చేయుట, ఎంతో ఆహ్లాదకరముగ వుండును. ఇందువలన ఎంతో పుష్టివచ్చును. దీనిని అభ్యసించి లాభములను అనుభవించుము. త్వరత్వరగా నడచువారు 'ఓం' ను మానసికముగగాని, నెమ్మదిగాగాని స్మరించవచ్చును. ఏప్రయత్నమును లేకుండ సహజ ప్రాణాయామమును చేయుము.

శవాసనములో

ఒక జంఖానాపరచి, దానిపైన వెల్లకిలగ పడుకొనుము. చేతులను ప్రక్కగా పెట్టుకొనుము. కాళ్ళు జాపుము. చీలమండలను రెంటినీ దగ్గరగావుంచి కాలి బొటనవ్రేళ్ళను కొంచెము దూరముగావుంచుము. స్నాయువులను, నరములను సడలించి వుంచుము. చాల బలహీనముగవుండువారు ఈవిధముగ ప్రాణాయామమును చేయవచ్చును. ఏ విధమగు శబ్దము చేయకుండ రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని పీల్చుము. శ్రమ లేకుండ ఆపగలిగినంతసేపు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని విడచుము. పై విధముగా ఉదయం 12 మారులు, సాయంత్రం 12 మారులు