ఈ పుట ఆమోదించబడ్డది

గాలిని పీల్చకుండ ఆపుము. ఈ విధముగ ఉదయం ఆరు పర్యాయములు, సాయంత్రం ఆరు పర్యాయముల చేయుము. క్రమ క్రమముగ ఏ విధమగు శ్రమయు పడకుండ ప్రాణాయామముల సంఖ్యను, కుంభక సమయమును అధికముచేయును.

సుఖపూర్వక ప్రాణాయామము

నీ యిష్ట దేవతకు ఎదురుగా, నీవు ధ్యానముచేసి కొను గదిలో పద్మాసనములోగాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా గాలిని పీల్చుము. తరువాత ఎడమ ముక్కునుకూడ కుడి వుంగ్రపు, చిటికెన వ్రేళ్ళతో మూయుము. నీవు శ్రమ లేకుండ ఆపగలిగి నంతసేపటికి వరకు గాలిని లోపల ఆపుము. ఆపైన కుడి ముక్కుతో (బొటన వ్రేలు తీసి) చాల నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో గాలిని పీల్చి, పైన చెప్పిన విధముగా కుంభకము చేసి, తరువాత ఎడమ ముక్కుతో పైన చెప్పినటుల గాలి విడువుము. ఇదంతయు ఒక ప్రాణాయామము అగును. ఇట్టి ప్రాణాయామములు ఉదయమున 20, సాయంత్రం 20 చొప్పున చేయుము. క్రమ క్రమముగ సంఖ్యను పెంచుచూ రమ్ము. గాలిని పీల్చునప్పుడు దయ, ప్రేమ, క్షమ, శాంతి, ఆనందము మొదలగు దైవీసంపదలు నీలో ప్రవేశించుచున్ననవిన్ని, గాలిని విడచు నప్పుడు, కోపము, కామము, అసూయ మొదలగు రాక్షసీ సంపదలు నీ నుండి బయటకు వెళ్ళిపోవుచున్న వనిన్ని, ఈవిధమగు మానసిక భావమును కలిగి యుండుము. పూరక కుంభక రేచక సమయములందు మాన