ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథివరకు మార్గమును చేసికొని ముక్తుడై సుఖలాభమును యోగించువాడు అనుభవించును. ఇట్టి స్థితి అనేక జన్మలలో చేసిన యజ్ఞయాగాదులు, గురుకృప, దైవకృప, యోగ సాధనలచే లభించును.

నాడీ శుద్ధి కొరకు

మాలిన్యముతో నిండియున్న నాడులలోనికి వాయువు చొరజాలదు. కావున మొట్టమొదట వీటిని శుభ్రపరచి, ఆపైన ప్రాణాయామమును అభ్యసించవలెను. నీడీశుద్ధికి సమాణుపు, నిర్మాణుపు అను రెండుమార్గములు గలవు. సమాణు విధానమునే బీజాక్షర మంత్రజపమనిన్నీ, నిర్మాణ విధానమును షట్కర్మానుష్ఠానమనిన్నీ అందురు.

1. పద్మాసనములో కూర్చొనుము. వాయువుయొక్క బీజాక్షరమగు పొగలాటి రంగుగల 'వం' ను ధ్యానించుము. ఎడమ ముక్కుతో గాలిని పీల్చుచూ 16 మారులు ఆ బీజాక్షరమును జపించుము. (ఇది పూరకము) తరువాత 64 మారులు ఆ బీజాక్షరమును జపించునంతవరకు గాలిని లోపలబంధించుము (కుంభకము) ఆ పిమ్మట 32 మార్లు ఆ బీజాక్షరమును జపించుచూ, అన 32 మార్లు జపించుట పూర్తియగు నంతవరకు, గాలిని బయటకు విడువుము (రేచకము)

2. బొడ్డు అగ్ని తత్త్వమునకు అధిష్ఠానము. ఈ అగ్ని తత్త్వముపై ధ్యానము చేయుము. కుడి ముక్కుతో అగ్ని బీజాక్షరమగు 'రం' ను 16 మారులు జపించుట అగునంత వరకు గాలిని పీల్చుము. ఆ పిమ్మట 64 మారులు జపించునంత