ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణాయామ సాధనచే ఆకలి, జీర్ణశక్తి, ఆనందము, బలము, ధైర్యము, ఉత్సాహము, చక్కని ఆరోగ్యము, పుష్టి, శక్తి, ఏకాగ్రతలు లభించును.

యోగి యగువాడు తన ఆయువును సంవత్సరములతో లెక్కించడు; అతని శ్వాసతో లెక్కించును. ఈ బాహ్య ప్రకృతినుండి నీవు పీల్చుగాలితో కొంతశక్తిని తీసికొందువు. దీర్ఘముగా గాలిని బయటకు విడచిన పిదప మరల అంత దీర్ఘముగా గాలినిపీల్చుటయే, మనుజుడు బాహ్యప్రకృతినుండి శక్తి కొలది తీసికొన గలిగిన ప్రాణశక్తియొక్క అత్యధిక ప్రమాణము. నిమిషమునకు 15 మారులు మనుష్యుడు శ్వాసించును. ఆ ప్రకారము రోజుకు 21,600 మార్లు శ్వాసించుచున్నాడు

రకరకములగు ప్రాణాయమములు

"బాహ్యాభ్యంతర స్తంభవృత్తి: దేశకాల సంఖ్యాభి: పరిదృష్టో దీర్ఘాత్ సూక్ష్మాత్"

యొగసూత్ర - 2 అ 50 సూ.

ప్రాణాయామము దీర్ఘముగాని సూక్ష్మముగాని మూడు అంగములు గలదిగా వున్నది. 1. బాహ్యము 2. ఆంతరికము 3. స్థంభము, అని. స్థలము, కాలము, సంఖ్యలపై ఇది ఆధారపడియున్నది.

గాలిని బయటకు విడచుటను రేచకము అందురు. ఇది మొదటి ప్రాణాయామము. గాలిని లోపలికి పీల్చుట రెండవది. గాలిని విడువకను, పీల్చకను లోపల ఆపుచేసి వుంచుట (కుంభకము) మూడవది కుంభకము ఆయు:ప్రమాణమును పెంచును. అంతరిక ఆధ్యాత్మిక శక్తులను, బలమును, శక్తిని, పుష్టిని పెంపొందింపజేయును. నీవు ఒక నిమిషముసేపు వాయువును కుంభించ